నేచురల్​ స్టార్​ నాని అతిథిగా ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్​ ఈ ఆదివారం జీ తెలుగులో!

హైదరాబాద్, 13 మార్చి: ప్రేక్షకులకు వినోదం అందించడమే ప్రధానం లక్ష్యంగా కొనసాగుతున్న ఛానల్ జీ తెలుగు( Zee Telugu )అలరించే ఫిక్షన్​, నాన్​ ఫిక్షన్​ షోలతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న జీ తెలుగు పండుగ సంబరాలను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.ఈ ఉగాది పర్వదినాన్ని కూడా వినోదంతో నింపేందుకు ఉగాది మాస్​ ధమాకా అవార్డ్స్​తో మీముందుకు వచ్చేస్తోంది.

 Ugadi Mass Dhamaka Awards Set To Air This Sunday, Only On Zee Telugu , Ugadi Ma-TeluguStop.com

సంప్రదాయం, సరదా కలబోసిన ఉగాది మాస్​ ధమాకా అవార్డ్స్​( Ugadi Mass Dhamaka Awards ) మార్చి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మాత్రమే! జీ తెలుగు అందిస్తున్న ఈ ప్రత్యేక ఉగాది కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించేందుకు చాలామంది నటీనటులు పాల్గొన్నారు.టాలీవుడ్ ప్రముఖ హీరోలు నేచురల్ స్టార్ నాని, విశ్వక్ సేన్( Vishwak Sen ) జీ తెలుగుఆర్టిస్టులతో కలిసి పండుగ వేడుకల్లో సందడి చేశారు.

అంతేకాదు, ఈ కార్యక్రమంలో ఇంటింటి రామాయణం, రావణాసుర, రైటర్​ పద్మభూషణ్ చిత్రాల టీమ్స్​,సందడితోపాటు మరెన్నో అందమైన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఇక ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి మరింత వినోదాన్ని పంచనుంది.

జీ తెలుగు నటీనటుల సంప్రదాయ, జానపద ప్రదర్శనలు వేడుకలో పండుగ వాతావరణాన్నితలపిస్తాయి.కారం కారం మమకారం, చింత చచ్చిన పులుపు చావదు వంటి ప్రత్యేక అవార్డుల ప్రధానం, అతిథులుగావచ్చిన నటీనటులతో రోహిణి, పార్వతి మరియుఇమ్మాన్యుయేల్ సరదా సంభాషణ కూడా ఈవెంట్‌కు మరింత వినోదాన్ని జోడించాయి.

నాన్​స్టాప్​ సందడితో సాగుతున్న కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెప్పేందుకు ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్న నేచురల్ స్టార్ నాని అందరి హృదయాలను గెలుచుకుంటారు.అలాగే ఇంటింటి రామాయణం చిత్రం నుండి జీవన్, రాహుల్ రామకృష్ణ, రావణాసుర సినిమా నుండి ఫరియా అబ్దుల్లా, దర్శకుడు సుధీర్ వర్మ, నటుడు సుహాస్‌తో పాటు రైటర్​ పద్మభూషణ్ చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని మరింతగా అలరించనున్నారు.

హీరోవిశ్వక్ సేన్ ఎంట్రీ, బాలయ్య బాబుడైలాగ్​తో విశ్వక్​ చేసే సందడి అక్కడున్న వారితో ఈలలువేయిస్తుంది.జీ తెలుగు ఆర్టిస్టులు, అతిథులతో కలిసిశ్రీముఖి చేసే సందడి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube