అతడు సినిమాకు మహేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా... ఇన్నేళ్లకు బయటపెట్టిన మురళీమోహన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన అద్భుతమైన సినిమాలలో అతడు( Athadu ) సినిమా ఒకటి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

2005వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

Uday Kiran Is The First Choice For Athadu Movie Details,uday Kiran, Mahesh Babu,

ఇక ఈ సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, జయభేరీ ఆర్ట్స్ పతాకంపై నటుడు మురళీమోహన్ ( Murali Mohan ) ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మురళీమోహన్ బయట పెట్టారు.

Uday Kiran Is The First Choice For Athadu Movie Details,uday Kiran, Mahesh Babu,

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ సినిమాని చేయాలి అనుకున్నప్పుడు ముందుగా నటుడు ఉదయ్ కిరణ్( Uday Kiran ) తో చేయాలని అనుకున్నాము.మొదటి నుంచే ఉదయ్ కిరణ్ ను బాగా దగ్గర చేసే వాడినని, తరుచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడని చెప్పారు.ఈ సినిమా చేయాలనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కుమార్తె( Chiranjeevi Daughter ) పెళ్లి చర్చలు జరుగుతూ వచ్చాయి.

Advertisement
Uday Kiran Is The First Choice For Athadu Movie Details,Uday Kiran, Mahesh Babu,

ఆయన సినిమా డేట్స్ అన్నీ వేరే టీమ్ చూడటం వల్ల బిజీ అయ్యారని అన్నారు.దాంతో ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమాతో మహేష్ బాబుతో చేసామని మురళి మోహన్ తెలిపారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు