చేసింది ఐదు సినిమాలే.. ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్.. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?

హీరోయిన్ దివ్య ఖోస్లా కుమార్‌ టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన లవ్ టుడే( Love today ) సినిమాతో హీరోయిన్గా కెరియర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.2004లో ఈ సినిమా విడుదల అయింది.

ఆ తర్వాత అబ్‌ తుమారే హవాలే వాటా సాథియా సినిమాతో బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చింది.

అందులో ఆమె అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ బాబీ డియోల్ సరసన నటించింది.మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె సినిమా రంగంలో స్థిరపడాలనే కోరికతో అందరిలా దివ్య ఖోస్లా కుమార్‌.

ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆల్బమ్స్‌ లలో మెరిసింది.ఒక్క సినిమా జీవితాన్నే మార్చేసింది.90ల నాటి పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన దివ్యా ఖోసలా.

ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో అయ్యో రామ పెద్ద సంచలనమే సృష్టించింది.తన గ్లామర్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది.ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహా అనేక మ్యూజిక్ వీడియోలో కనిపించింది.2004లో అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో సినిమా ఆమెకు బాలీవుడ్‌ మొదటి చిత్రం.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచి ఆమె కెరీర్‌ను దెబ్బతీసింది.

Advertisement

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ, ఇది దివ్య ఖోస్లా కుమార్( Divya Khosla Kumar ) వ్యక్తిగత జీవితానికి కొత్త మార్గాలను తెరిచింది.ఈ సినిమా సెట్‌లో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యను చూసిన మొదటిసారే ప్రేమలో పడ్డారు.

అలా ఇరుకుటుంబాలు పెద్దలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకున్నారు.వీరికి 2011లో ఒక బాబు జన్మించాడు.

పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసిన దివ్య 2016లో సనమ్‌ రే( Sanam Re ) చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.దర్శకనిర్మాతగానూ పలు సినిమాలు చేసింది.పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన దివ్య టి-సిరీస్ మ్యూజిక్ లేబుల్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయిన భూషణ్ కుమార్ గత 19 సంవత్సరాలుగా దివ్య ఖోస్లా కుమార్‌తో కలిసే జీవిస్తున్నారు.

ఆయనతో వివాహం అయ్యాక యారియన్, సనమ్ రే చిత్రాలకు దర్శకురాలిగా కొనసాగింది.ఆ తర్వాత షారుఖ్‌ రాయ్ చిత్రానికి నిర్మాతగా కొనసాగింది.ప్రొడ్యూసర్‌గా 8 సినిమాలు తెరకెక్కించింది.2021లో సత్యమేవ జయతే 2 సినిమాలో జాన్ అబ్రహం సరసన నటించిన ఆమె.చివరిసారిగా యారియన్ 2 లో కనిపించింది.ఇది బెంగళూరు డేస్ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా వచ్చింది.దివ్యా ఖోస్లా కుమార్ నికర విలువ సుమారు 5 మిలియన్లు అంటే దాదాపు రూ.42 కోట్లు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో, అతని కుటుంబం నికర విలువ రూ.10,000 కోట్లతో 175వ అత్యంత సంపన్న భారతీయుడిగా ర్యాంక్ పొందారు.గతేడాదిలో యానిమల్‌,ఆదిపురుష్‌ వంటి చిత్రాలకు నిర్మాతగా ఆయన మరింత పాపులర్‌ అయ్యారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు