కుబేరపచ్చ కుంకుమతో లక్కే లక్కు.. అసలు ఇది ఎలా పుట్టిందంటే

కుబేరపచ్చ కుంకుమ పెట్టుకుంటే.లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలిపోదు.ఎందుకుంటే కోటానుకోట్ల దేవతల్లో అందరికంటే ధనవంతుడు కుబేరుడే.

ఆయన వల్ల పుట్టిన పచ్చ కుంకుమ ను ధరిస్తే.మీరు కూడా ధనవంతులు అయిపోవచ్చు.

అసలు ఈ కుంకుమ ఎలా పుట్టిందో ముందుగా తెలుసుకుందాం.పరమేశ్వరుడి భక్తుడైన కుబేరుడు ఓ రోజు కైలాసానికి వెళ్లాడు.

అప్పుడు శివపార్వతులిద్దరూ కామవేదనతో నాట్యం చేస్తున్నారట.ఆ దృశ్యాన్ని చూసిన కుబేరుడు.

Advertisement
Kubera-pachha-kunkuma-special-story, Kubera-pachha Kunkuma, Kubbera , Lord Shiva

అమ్మగా భావించాల్సిన పార్వతీదేవిని కామంతో చూశాడట.విషయం గుర్తించిన శివుడు కోపోద్రిక్తుడయ్యాడు.

శివుడిలో సగ భాగమైన పార్వతీదేవికి కూడా విషయం బోధపడింది.అమ్మలా చూడాల్సిన తనను కుబేరుడు ఆ రకంగా భావించడాన్ని జీర్ణించుకోలేకపోయింది.

విపరీతమైన కోపంతో పార్వతీ పరమేశ్వరులిద్దరూ కుబేరుడిని చూశారు.ఆ కోపాగ్నికి కుబేరుడి తనువంతా కాలిపోయింది.

Kubera-pachha-kunkuma-special-story, Kubera-pachha Kunkuma, Kubbera , Lord Shiva

కుబేరపచ్చ కుంకుమతో లక్కే లక్కు.అసలు ఇది ఎలా పుట్టిందంటే.వెంటనే తేరుకున్న కుబేరుడు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

క్షమించమంటూ వారిని వేడుకున్నాడు.ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని హామీ ఇచ్చాడు.

Advertisement

బలహీన క్షణంలోనే ఇలా జరిగిందని మొరపెట్టుకున్నాడు.కుబేరుడిని క్షమించిన శివపార్వతులు.

మా కోపంతో కాలిపోయిన నీ శరీరం, మాలో మళ్లీ వచ్చిన శాంతంతోనే బాగవుతుందని తెలిపాడు.శివుడి కంఠం చుట్టూ ఉన్న నీల వర్ణం.

పార్వతీ దేవి బంగారు ఛాయను తాకి.ఈ కిరణాలు భూమిపై పడ్డాయి.

అలా పడిన కిరణాలతో.ఈ నేలంతా ఆకపచ్చ రంగులోకి మారింది.

ఆ విషయాన్ని గుర్తించిన కుబేరుడు దానిని కుంకుమగా భావించి ఒళ్లంతా రాసుకున్నాడు.వెంటనే తన శరీరం మామూలు స్థితికి వచ్చేసింది.

అప్పటి నుంచి కుబేరుడు ప్రతీ రోజు ఆ మట్టిని తన ఒంటికి రాసుకునేవాడు.అలా ఆ పచ్చ కుంకుమ కుబేరుడికి ప్రీతి పాత్రమైంది.

కుబేరుడికి ఇష్టమైన ఆ కుంకుమ మీరు కూడా ధరిస్తే.లక్ష్మీ దేవి మీ ఇంట్లో శివతాండవం చేస్తుంది.

తాజా వార్తలు