సముద్రంలో పరుపుపై తేలుతూ బీర్లు తాగారు.. చివరకు..

ఇద్దరు యువకుడు మందు తాగాలని అనుకున్నారు.ఇందులో ఏముంది ఆశ్చర్యం అనుకుంటున్నారా.

వాళ్ళు మాములుగా తాగితే అందులో ఆశ్చర్యం ఏమి లేదు.

వాళ్ళు సముద్రం మీద తేలుతూ తాగాలనుకున్నారు.

అందుకే వారు చిక్కుల్లో పడ్డారు.ఐడియా రాగానే వెంటనే ఒక గాలి పరుపుతో సముద్రం దగ్గరకు వెళ్లిపోయారు.

వారితో పాటు బీర్లు కూడా తీసుకెళ్లారు.సముద్రం మీద గాలి పరుపు వేసి దానిపై కూర్చుని బీర్లను ఆస్వాదిస్తూ తాగుతున్నారు.

Advertisement
Two Men Drift Away To Sea While Chugging Beers On A Blow Up Mattress,West Austra

తగినంతసేపు బాగానే తాగారు.బీర్లు కాళీ అయితే కానీ తెలియలేదు వాళ్ళు అప్పటికే సముద్రం మధ్యలోకి వెళ్లారని.

అప్పుడు వారికి ఏం చేయాలో అర్ధం కాలేదు.వాళ్ళు తిరిగి ఎలా ఒడ్డుకు చేరుకున్నారో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ పెర్రే, నోహ్ పాల్మర్‌ ఇద్దరు స్నేహితులు సముద్రం దగ్గరకు వెళ్లి మందు కొట్టాలని అనుకున్నారు.

ఒక గాలి పరుపుతో పాటు బీర్లను కూడా వారితో పాటు తీసుకెళ్లారు.తీరంలో నీటి అలలపై తేలుతూ మందు కొట్టాలను అనుకుని పరుపును అలల దగ్గర వేసుకుని ఇద్దరు కూర్చుని ఒక్కటిగా తాగుతున్నారు.

Two Men Drift Away To Sea While Chugging Beers On A Blow Up Mattress,west Austra
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అలా ఎంజాయ్ చేస్తూ చాలా సేపు బాగానే తాగారు.సరిగ్గా ఆ తప్పే వారిని చిక్కుల్లో పడేసింది.సముద్ర తీరంలో మాములుగా గాలి ఎక్కువుగా వస్తుంది.

Advertisement

దీంతో వారి గాలి పరుపు కూడా వారికి తెలియకుండానే ఆ గాలికి సముద్రం మధ్య వరకు అలా వెళ్ళిపోయింది.అంతలో వాళ్ళు తెచ్చుకున్న బీర్లు కూడా కాళీ అవ్వడంతో అప్పుడు చూసారు వాళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్లారని.

ఆ తర్వాత వాళ్లకు భయంతో ఏం చేయాలో అర్ధం కాలేదు.ఎలాగో అదే సమయానికి వాళ్ళ ఫోన్లో సిగ్నల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే వాళ్ళ స్నేహితుడు సీక్‌ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో అతడు వెంటనే జెట్ మీద అక్కడికి చేరుకున్నాడు.

ఎలాగోలా వాళ్ళ స్నేహితుల ఆచూకీ సముద్రంలో కనిపెట్టాడు.వారిని సముద్రంలో కొట్టుకుపోకుండా కాపాడాడు.

ఇప్పుడు ఈ ఘటనకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సురక్షితంగా వచ్చిన వారు తర్వాత మీడియాతో మాట్లాడి జరిగిన విషయాన్నీ పంచుకున్నారు.

తాజా వార్తలు