చిన్నారులతో లైంగిక వాంఛలు... భార్య భర్తలకి 26 ఏళ్ల జైలు శిక్ష

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు చేసే కామందుల సంఖ్య పెరిగిపోతుంది.వారి భాగోతాలు కూడా బయటపడుతున్నాయి.

ముఖ్యంగా శారీరక వాంఛలు తీర్చుకోవడానికి చాలా మంది సైకోలుగా ప్రవర్తిస్తూ, సొసైటీలో మాత్రం మంచితం, పెద్దమనుషుల ముసుగు వేసుకొని తిరుగుతున్నారు.అయితే వారి భాగోతాలు ప్రపంచానికి పరిచయం అయినపుడు ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉంటాయి.

ఇప్పుడు మాన్ చెస్టర్ కి చెందిన ఓ మాజీ దంపతులకి సంబంధించిన భాగోతాలు అందరిని భయపెట్టాయి.చిన్నారుల మీద వారి లైంగిక వాంఛలు తీర్చుకోవడం, వాటిని వీడియోలలో చిత్రీకరించి ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం చేస్తూ ఉండేవారు.

వారి మీద ఓ ఆడెల్ల బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది.దీంతో పోలీసులు వారిని అదుపులోకి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Advertisement

ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్‌లో గ్రేటర్‌ మాన్‌చెస్టర్‌లోని డుకిన్‌ఫీల్డ్‌కు చెందిన వారు.వారు 2016లో డేటింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రేమించుకున్నారు.

భార్య ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు.పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది.

తరువాత వారి ఆలోచనలు చిన్నారుల మీదకి మళ్ళింది.టేలర్‌ కామవాంఛలు తీర్చుకోవడం కోసం ఇంటర్నెట్‌ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకొని బుర్లింగమ్‌కు పంపించేవాడు.

పెళ్లి తర్వాత భార్యకి స్కూల్ డ్రెస్‌తో లైంగిక కోరికలు తీర్చుకునేవారు.తరువాత వారు హద్దులు ధాటి చిన్నారులతో వాంఛలు తీర్చుకోవడం మొదలెట్టారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్‌ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించేది.తరువాత భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగా అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి షేర్‌ చేసుకునే పైత్యానికి దిగారు.

Advertisement

తరువాత వారిమధ్య గొడవలు వచ్చి విడిపోయిన తర్వాత కూడా వారి అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవారు.అయితే ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్‌ అరెస్ట్‌ అయ్యారు.

ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా టేలర్‌ ని కూడా అరెస్ట్ చేశారు.వారి సెల్ ఫోన్ లో చిన్నారులతో అసభ్యంగా తీసుకున్న వీడియోలు సేకరించారు.

వాటి ఆధారంగా కోర్టు వారిని తీవ్రమైన దోషులుగా పరిగణిస్తూ శిక్షని ఖరారు చేసింది.

తాజా వార్తలు