కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు.. షాక్ అయిన వైద్యులు!

ఇటీవల కాలంలో శృంగారపరంగా, యువతీ యువకులు స్వేచ్ఛగా ఉంటున్నారు.ఆ సమయంలో అంతా బాగున్నా, తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి.

 Twin Children Have Different Fathers Doctors Are Shocked , Twins, Different Fath-TeluguStop.com

ఇక పెళ్లైన మహిళలు ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల పుట్టే పిల్లలికి ఎవరు తండ్రో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.అయితే విదేశాలలో పెళ్లి కాకపోయినా, సహజీవనం కారణంగా పిల్లలను కంటూ ఉంటారు.

అది అక్కడ సర్వసాధారణమే అయినా, ఒక్కోసారి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా ఇదే తరహాలో బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఒకే రోజు ఇద్దరితో శృంగారం చేసింది.

దీంతో గర్భం దాల్చిన ఆమె ఇటీవల కవలలకు జన్మనిచ్చింది.అయితే పితృత్వ పరీక్షలు చేసి, ఆ పిల్లలకు తండ్రి ఎవరో తెలుసుకునే క్రమంలో ఆశ్చర్యకర విషయం తెలిసింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బ్రెజిల్ దేశం గోయాస్‌లోని మినేరియోస్‌కు చెందిన యువతి ఇటీవల కవలల పిల్లలకు జన్మనిచ్చింది.

అయితే వారికి డీఎన్ఏ పరీక్షలు చేసిన వైద్యులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.ఇద్దరు పిల్లలకు వేర్వేరు తండ్రులని తెలిసింది.

ఆ యువతిని అడగగా, ఆమె అసలు విషయం గుర్తు తెచ్చుకుంది.ఒకే రోజు వేర్వేరు వ్యక్తులతో తాను శృంగారంలో పాల్గొన్నట్లు వైద్యులకు తెలిపింది.

దీంతో వారిద్దరి శుక్రకణాలతో రెండు అండాలను కలవడంతో కవలలు పుట్టారు.వైద్య పరిభాషలో శాస్త్రీయంగా హెటెరోపరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని వైద్యులు వెల్లడించారు.

కోట్లలో ఒకరికి ఇలా జరుగుతుందని వివరించారు.

ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం 20 ఇతర హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండరేషన్ కేసులు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఒకే ఋతు చక్రంలో విడుదలైన రెండవ అండాశయం విడిగా లైంగిక సంపర్కంలో వేరే పురుషుడి స్పెర్మ్ కణాల ద్వారా అదనంగా ఫలదీకరణం చేయబడినప్పుడు ఈ కేసు సంభవిస్తుందని వివరించారు.శిశువులకు ఇప్పుడు 16 నెలల వయస్సు ఉందని, తండ్రులలో ఒకరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని పిల్లల తల్లి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube