Anchor Pratyusha: వామ్మో.. యాంకర్ ప్రత్యూషకి అంత పెద్ద కూతురు ఉందా.. నెట్టింట వీడియో వైరల్?

టాలీవుడ్ యాంకర్ ఓంకార్( Omkar ) గురించి మనందరికీ తెలిసిందే.

గతంలో ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించిన ఓంకార్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ షో కి( Sixth Sense ) హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సిక్స్త్ సెన్స్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఐదవ సీజన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.

శని ఆదివారాలు రాత్రి 9 గంటల సమయంలో ప్రసారం అయ్యే ఈ షోకీ ఎప్పటికప్పుడు వెండితెర బుల్లితెర సెలబ్రిటీలను తీసుకువస్తూ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా రానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

Tv9 Anchor Pratyusha Full Fun With Ohmkar At Sixth Sense Season 5 Promo

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈసారి ఏకంగా టీవీ యాంకర్లను గెస్ట్లుగా తీసుకువచ్చి వాళ్లతో ఆడి పాడించారు ఓంకార్.టీవీ 9 యాంకర్లు దీప్తి, ప్రత్యూషలతో పాటు మరికొంతమంది యాంకర్లు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌లో ఫుల్ ఫన్ అందించారు.

Advertisement
Tv9 Anchor Pratyusha Full Fun With Ohmkar At Sixth Sense Season 5 Promo-Anchor

అయితే టీవీ 9 యాంకర్ దీప్తితో తన లవ్ స్టోరీని చెప్పించిన ఓం కార్‌కి పెద్ద షాకే ఇచ్చింది మరో యాంకర్ ప్రత్యూష.( Anchor Pratyusha ) నీకు పెళ్లైందా? అని యాంకర్ ప్రత్యూషని ఓంకార్ అడగగా ఆ మాటకి ఆమె పక్కనున్న యాంకర్లు.హయ్యో అంటూ అవాక్కయ్యారు.

అయితే ప్రత్యూష మాత్రం.అమాయకంగా ఫేస్ పెట్టి.

సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో అని అనేసింది.

Tv9 Anchor Pratyusha Full Fun With Ohmkar At Sixth Sense Season 5 Promo

పక్కనున్న వాళ్లు ఏదో చెప్పబోతుండగా ఉండవమ్మా నేను మాట్లాడుతున్నాను కదా? అంటూ వాళ్లని వారించింది ప్రత్యూష. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు సార్ అని ప్రత్యూష అంటుండగా.వాళ్ల పాపకి అంటూ దిమ్మతిరిగే సెటైర్ వేసేసింది యాంకర్ దీప్తి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

దాంతో ఓంకార్ పెద్దగా నవ్వుతూ.నిజంగా అంత పెద్ద పాప ఉందా? అనగా మీకు చూడాలని ఉందా అని పక్కన యాంకర్ అనగా నాకు చూడాలని ఉంది అంటూ ప్రత్యూష కూతుర్లను( Anchor Pratyusha Daughters ) స్టేజ్‌పైకి పిలిపించారు.అయితే యాంకర్ ప్రత్యూష పెద్ద పాప హైట్‌లోనూ వెయిట్ లోనూ తల్లితో సమానంగా ఉన్నట్టే ఉంది.

Advertisement

కూతుర్ని కనిపించకుండా దాచేస్తూ స్టేజ్‌పై నవ్వులు కురిపించింది ప్రత్యూష.ప్రత్యూష కూతుర్ని చూసి షాకైన ఓంకార్.

వీళ్లిద్దరూ సిస్టర్స్‌లా ఉన్నారు కదా? అని అన్నాడు.మేం బయటకు వెళ్తే చాలామంది అలాగే అంటారు అని మురిసిపోయింది సంతూర్ మమ్మీ యాంకర్ ప్రత్యూష.

తాజా వార్తలు