సముద్రంలో మునిగిపోతున్న దేశం.. తమ చరిత్ర కోసం కీలక నిర్ణయం

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు ప్రపంచంలో నాల్గవ అతిచిన్న దేశం.గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

 Tuvalu Island Is The First Digital Country ,drowning ,sea, Key Decision, Histor-TeluguStop.com

తువలు ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్య ఉన్న ఒక ద్వీపం.ఐక్యరాజ్యసమితి దీనిని అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రకటించింది.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా, సముద్ర మట్టం పెరుగుతోంది.ఫలితంగా ఓ పదేళ్లలో ఇదిపూర్తిగా సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తమ దేశం కాలగర్భంలో కలిసి పోయినా, తమ చరిత్ర పుటలను భావితరాలకు అందించేందుకు ఎన్నో విషయాలను డిజిటల్ చేసింది.

ఫలితంగా తొలి డిజిటల్ దేశంగా కీర్తికెక్కింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తువలు తొమ్మిది ద్వీపాల సమూహం.26 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ దీవులు ఉంటాయి.ఇక్కడ 12 వేల మంది జనాభా మాత్రమే ఉంటారు.సూర్యరశ్మిని నివారించడానికి ఇక్కడి ప్రజలు పొడవైన బట్టలు ధరిస్తారు.ఈ దేశంలో 32 ఏళ్లకే చాలా మందిలో వృద్ధాప్య ఛాయలు కనపడతాయి.సన్ స్క్రీన్ లోషన్ కోసం వీరు పొరుగు దేశాలకు వెళ్తుంటారు.

ఇక తువాలు దీవులు భూతాపం, ఉష్ణోగ్రతలు, ఇతర పరిణామాల వల్ల క్రమంగా సముద్రంలో మునిగిపోతున్నాయి.ఈ తరుణంలో తమ దేశ నైసర్గిక స్వరూపం, ప్రజల జీవన విధానాలు, తమ సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు, డిజిటల్ రూపంలో తమ దేశాన్ని భద్ర పర్చనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సైమన్ కోఫీ ప్రకటించారు.దేశ ప్రజలకు తమ దేశాన్ని నేరుగా చూస్తున్న అనుభూతిని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube