తెల్ల జుట్టుతో చింతేలా.. ఈ మూడింటితో సహజంగానే నల్లగా మార్చుకోండి!

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది పాతిక‌, ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు( white hair ) సమస్యను ఎదుర్కొంటున్నారు.

తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడటానికి రకరకాల కారణాలు ఉంటాయి.

ఏదేమైనా త‌ల‌లో తెల్ల వెంట్రుకల‌ను చూడగానే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.తీవ్ర ఒత్తిడికి లోన‌వుతారు.

వెంట‌నే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

Turn White Hair Black Naturally With These Three Powerful Ingredients Hair, Hai

ఈ రెమెడీతో తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి కనీసం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

Advertisement
Turn White Hair Black Naturally With These Three Powerful Ingredients! Hair, Hai

ఇలా వేయించుకున్న కలోంజీ సీడ్స్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

Turn White Hair Black Naturally With These Three Powerful Ingredients Hair, Hai

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

కలోంజి సీడ్స్, కాఫీ పౌడర్ మరియు ఆవనూనె.ఈ మూడు తెల్లబడిన జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడుతాయి.

తెల్ల జుట్టు రావడం ప్రారంభమైన వెంటనే ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని వారానికి రెండు సార్లు చొప్పున పాటిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో తెల్లగా మారిన జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఒకవేళ తెల్ల జుట్టు మీకు లేకపోయినా కూడా ఈ రెమెడీని ట్రై చేయ‌వ‌చ్చు.ఈ రెమెడీ మీ జుట్టు ఎల్లప్పుడూ నల్లగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Advertisement

అలాగే కలోంజి సీడ్స్, ఆవనూనె మరియు కాఫీ పౌడర్ హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తాయి.మరియు జుట్టు రాలడాన్ని సైతం అరికడతాయి.

తాజా వార్తలు