బిగ్ బాస్- 7 గొడవలో బస్సుల ధ్వంసంపై టీఎస్ఆర్టీసీ సీరియస్

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 గొడవ నేపథ్యంలో జరిగిన బస్సుల ధ్వంసంపై టీఎస్ ఆర్టీసీ సీరియస్ అయింది.

సీజన్ లోని కంటెస్టెంట్స్ అభిమానులు ఆరు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలో బస్సులపై దాడి నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది.

ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లేనని తెలిపింది.ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలను ఉపేక్షించమని హెచ్చరించింది.

ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అన్న టీఎస్ఆర్టీసీ అందరం కాపాడుకోవాలని సూచించింది.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!