మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను పోగొట్టి మెరిసే చ‌ర్మాన్ని అందించే సూప‌ర్ రెమెడీ ఇదే!

మొటిమ‌లు, మ‌చ్చ‌లు లేని మెరిసే చ‌ర్మాన్ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి.ముఖ్యంగా అమ్మాయిలు అలాంటి ముఖ చ‌ర్మం కోసం ఆశ‌ప‌డుతుంటారు.

తెగ ఆరాట‌ప‌డుతుంటారు.కానీ, ఆహార‌పు అల‌వాట్లు, హార్మోన్ ఛేంజ‌స్‌, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, స్ట్రెస్ వంటి ర‌క‌రాల కార‌నాల వ‌ల్ల ముఖంపై మొటిమ‌లో లేదా మ‌చ్చ‌లో ఏర్ప‌డి అందాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

దాంతో వాటిని వ‌దిలించుకోవ‌డం కోసం ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటారు.మీరు ఆ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు మాయం అవ్వ‌డ‌మే కాదు ముఖ చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా కూడా మారుతుంది.

మ‌రి ఇంత‌కీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని వాట‌ర్ లో శుభ్రంగా క‌డిగాలి.ఇలా క‌డిగిన ఆకుల‌ను మెత్త‌గా దంచుకుని జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసి పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ శాండిల్ వుడ్ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్లు పుదీనా జ్యూస్‌, రెండు చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, పావు స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాట‌ర్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు స్మూన్ తో మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.రోజుకు ఒక‌సారి ఈ విధంగా చేస్తే మొటిమలు, మ‌చ్చ‌లు పోయి ముఖం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు