జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!

జుట్టు అధికంగా ఊడిపోయి రోజు రోజుకు పల్చగా మారిపోతుందా.? జుట్టు ఎదుగుదలను( Hair Growth ) పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి కేవలం రెండు సార్లు ఈ ఆయిల్ ను తలకు రాశారంటే మీరు కోరుకున్నట్లే మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, మెంతులు మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంటపై దాదాపు 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార‌బెట్టుకోవాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.జుట్టు ఎదుగుదలకు ఈ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.

స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

పల్చటి జుట్టు దట్టంగా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఆరోగ్యమైన ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు