White hair : జుట్టు తెల్లగా మారడం స్టార్ట్ అయిందా.. లేట్ వద్దు వెంటనే ఇలా చేయండి!

తెల్ల జుట్టు( white hair ).చాలా మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

పైగా ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య బారిన పడుతున్నారు.తలలో తెల్ల వెంట్రుకలు కనిపించాయంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు, తెల్ల జుట్టు కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు, మీకు కూడా తెల్ల జుట్టు రావడం మొదలైందా.? అయితే అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడటం స్టార్ట్ చేయండి.రెమెడీతో ఈ న్యాచురల్ టోనర్ జుట్టు తెల్లగా మారడాన్ని స్టాప్ చేస్తుంది.

అలాగే తెల్లగా మారిన జుట్టును సైతం నల్లగా మారుస్తుంది.టోనర్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల‌ వాటర్ ను పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్( Tea powder ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా పౌడర్( Aloe vera powder ) వేసుకోవాలి.అలాగే నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు అరకప్పు గోరింటాకు ఆకులు వేసి ఉడికించాలి.

Advertisement

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ టోనర్ ను వాడితే కనుక జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.జుట్టు తెల్లబడటం ఆగుతుంది.

మరియు తెల్లబడిన జుట్టు క్రమంగా నల్లబడుతుంది.వైట్ హెయిర్ కు దూరంగా ఉండాలని భావించే వారికి ఈ హోమ్ మేడ్ టోనర్ ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

కాబట్టి తప్పక ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు