భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్ పొందొచ్చు!

కడుపు ఉబ్బరం( Stomach bloating ).మనం అత్యంత సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా భోజనం తర్వాత చాలా మందికి కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.ఆ సమయంలో ఏ పని చేయలేరు.

కొన్ని సార్లు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.వేళకు తినకపోవడం, హెవీగా ఆహారాన్ని తీసుకోవడం, తిన్న ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం తదితర కారణాల వల్ల కడుపు ఉబ్బరం స‌మ‌స్య త‌లెత్తుతుంది.

అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక సతమతమైపోతుంటారు.ఇలాంటి సందర్భం మీకు కూడా అనేక సార్లు ఎదురై ఉంటుంది.అయితే కడుపు ఉబ్బరం తగ్గడానికి ఎలాంటి మెడిసిన్ అక్కర్లేదు.

Advertisement

మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటి( Warm Water )ని తీసుకోండి.

అందులో రెండు టేబుల్‌ స్పూన్లు లెమన్ జ్యూస్ తో పాటు చిటికెడు నల్ల ఉప్పు( Black Salt ) వేసి బాగా కలిపి తీసుకోండి.

ఈ డ్రింక్ ను కనుక తాగితే కడుపు ఎంత ఉబ్బరంగా ఉన్నా సరే క్షణాల్లో రిలీఫ్ ను పొందుతారు.అలాగే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా ఈ డ్రింక్ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.కాబట్టి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.

ఒకవేళ మీ దగ్గర ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటే దాంతో కూడా కడుపు ఉబ్బరం స‌మ‌స్య‌ నుంచి బయటపడొచ్చు.అందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి క‌లపి తాగేయండి.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఆపిల్ సైడ‌ల్ వెనిగ‌ర్ పొట్టలోని పీహెచ్ స్థాయిని సమతుల్యం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు