మృదువైన మెరిసే చర్మం కోసం బనానా మాస్క్.. డోంట్ మిస్..!

చాలామందికి తమ ముఖ చర్మం ఎటువంటి మచ్చలు లేకుండా మృదువుగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు.

అటువంటి చర్మం పొందడం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే బనానా మాస్క్( Banana Mask ) మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

అదిరిపోయే బెనిఫిట్స్ ను మీ సొంతం చేస్తుంది.మరి ఇంతకీ ఆ బనానా మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం గింజలు( Almonds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాదం గింజలకు పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తొలగించిన బాదం గింజలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు అందులోనే ఐదు నుంచి ఆరు అరటిపండు స్లైసెస్,( Banana Slices ) చిటికెడు కుంకుమపువ్వు,( Saffron ) నాలుగైదు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఫైనల్ గా కూల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ బనానా మాస్క్ ను వేసుకోవాలి.

ఈ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ కణాల్లో పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.

చర్మాన్ని చాలా మృదువుగా మారుస్తుంది.అలాగే ఈ బనానా మాస్క్ ను వేసుకోవడం వల్ల సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

పంజాబీ ముద్దుగుమ్మ ప్రజ్ఞా నాగ్రా అందాలు చూస్తే కుర్రకారు ఫ్యూజులు ఔట్
చేతులు, పాదాలు మృదువుగా మెర‌వాలా? అయితే ఈ ఒక్క చిట్కా చాలు!

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగు ముఖం పడతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

Advertisement

కాబట్టి మృదువైన మెరిసే చర్మం కోసం ఆరాటపడేవారు ఈ బనానా మాస్క్ ను అస్సలు మిస్ అవ్వకండి.

తాజా వార్తలు