2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.
తనదైన శైలిలో తాజా పరిణామాలపై కామెంట్లు చేస్తూ ఉన్నారు.రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా తానే వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం జరిగింది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ కి అమెరికన్ లు ఊహించని షాక్ ఇచ్చారు.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ పడటానికి ఆసక్తి చూపుతూ ఉండగా. ఓ సర్వేలో కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి.
పూర్తి విషయంలోకి వెళ్తే CAPA హ్యారిస్ సర్వేలో 67% మంది బైడెన్ మరోసారి అధ్యక్షులు ఎన్నికలలో పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని తేలింది.ఇంకా ఇదే సర్వేలో డోనాల్డ్ ట్రంప్ నీ 57% మంది అధ్యక్షునిగా మళ్లీ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని తేలింది.
న్యూస్ జనరేషన్ సర్వేలో 73% మంది బైడెన్ పోటీకి ఇష్టపడటం లేదు.ఇంకా ఇదే సర్వేలో డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షునిగా పోటీకి వద్దని 43% మంది చెప్పడంతో ఈ ఇద్దరి పట్ల అమెరికాన్ లలో అసహనం ఏర్పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.