ప్రముఖ కాలర్ ఐడెంటిటీ అప్లికేషన్ ట్రూకాలర్ (Truecaller) స్కామర్ల గురించి యూజర్లను హెచ్చరించే సెర్చ్ కాంటెక్స్ట్( Search Context ) అనే కొత్త AI ఫీచర్‌ను తాజాగా లాంచ్ చేసింది.సెర్చ్ కాంటెక్స్ట్ నంబర్ పేరు ఇటీవల మారిందో లేదో చెక్ చేస్తుంది.
మారి ఉంటే, సెర్చ్ కాంటెక్స్ట్ వినియోగదారుకు తెలియజేస్తుంది.వారికి కలర్-కోడెడ్ మెసేజ్ చూపుతుంది.
బ్లూ కలర్ న్యూట్రల్ చేంజ్ ను సూచిస్తే, యెల్లో కలర్ సస్పెక్టెడ్ చేంజ్ ను, రెడ్ కలర్ బహుళ, తరచుగా మార్పులను సూచిస్తుంది.తద్వారా బాగా మార్పులు గల నంబర్ స్కామ్ నెంబర్ అయి ఉండొచ్చని అర్థం చేసుకోవచ్చు.
ట్రూకాలర్‌లో కొత్త లోగో కూడా పరిచయం చేసింది.పాత లోగో బ్లూ కలర్ లో ఉండగా కొత్తది డయలర్ ఐకాన్ కలిగి ఉంది.కొత్త లోగో ఇప్పటికీ బ్లూ రంగులోనే ఉంది, కానీ ఇది సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది.ఇతర డయలర్ యాప్‌ల నుంచి ప్రత్యేకంగా కనిపించాలని, వినియోగదారులను గందరగోళానికి గురిచేయకుండా నకిలీ ట్రూకాలర్ యాప్‌లను నిరోధించడానికి ట్రూకాలర్ దాని లోగోను మార్చింది.

ట్రూకాలర్ వినియోగదారులు మోసాన్ని నివారించడంలో సహాయపడటానికి సెర్చ్ కాంటెక్స్ట్ కూడా ప్రారంభించింది.మోసగాళ్లు పట్టుబడకుండా ఉండేందుకు తరచూ తమ ఫోన్ నంబర్ల పేర్లను మారుస్తుంటారు.సెర్చ్ కాంటెక్స్ట్ వినియోగదారులు ఈ స్కామర్‌లను( Scammers ) గుర్తించడంలో సహాయపడుతుంది.ట్రూకాలర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు, అలాన్ మామెడి( Alan Mamedi ) మాట్లాడుతూ,

కొత్త లోగో ఆవిష్కరణ పట్ల కంపెనీ యొక్క నిబద్ధతను, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడంలో దాని దృష్టిని ప్రతిబింబిస్తుందని చెప్పారు.కొత్త లోగో మరింత వర్సటైల్ గా ఉందని, వివిధ ప్లాట్‌ఫామ్‌లు, మార్కెటింగ్ మెటీరియల్‌లలో మరింత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చని కూడా అతను చెప్పాడు.







