రైతుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం సృష్టంగా కనిపిస్తుంది.. జీవన్ రెడ్డి కామెంట్స్.. ?

దేశానికి రైతే రాజు అన్నారు.కానీ నేడు రైతుల విషయంలో దేశంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం.

అడుగడుగునా అవినీతి ఎర్రతీవాచి పరచుకుని రాజ్యం ఏలుతుంటే, కార్పోరేట్ సామ్రాజ్యం కనుసైగతో శాసిస్తుంటే చెమటోడ్చి పండించిన పంటకు అన్యాయం జరుగుతుందని రైతు గొంతుచించుకుని గుండెలు పగిలేలా రోదిస్తుంటే సర్ధి చెప్పే వారేగానీ, ఆదుకునే నాధుడే కరువైయ్యాడు.ఇక ఈ విషయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Trs Government Failure In Case Of Farmers Jeevan Reddy Comments, Telangana Govt,

రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని, కింటా దాన్యంలో 5 కిలల దాన్యం దోపిడీకి గురవుతుందని తెలిపారు.అంతే కాకుండా రైతు బందు ప్ధం ద్వార వచ్చే ఐదు వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారని, ఇలా మొత్తానికి ప్రభుత్వ తీరు, మిల్లర్ల అవినీతితో రైతులు ఆర్ధికంగానే కాకుండా మానసికంగా కృంగి పోతున్నారని మొత్తానికి రైతులను ఆదుకోవడం లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు