టీఆర్ఎస్ భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతుందిః కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు.టీఆర్ఎస్ ఓట‌మి భ‌యంతోనే భౌతికదాడులకు పాల్పడుతుంద‌ని ఆరోపించారు.

ఎవ‌రు ఎన్ని దాడులు చేసినా, రూ.కోట్లు ఖర్చుపెట్టినా.కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావ‌డం త‌ధ్య‌మ‌ని చెప్పారు.

రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ప్రజలే త‌గిన బుద్ధి చెప్తార‌ని అన్నారు.అనంత‌రం టీఆర్‌ఎస్‌ సర్కార్ పట్ల పోలీసులు పక్షపాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా 6 నుంచి 7 నెలలేనని కిష‌న్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Validation Check 2026