తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
టాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు.
ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు.
ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సక్సెస్ అయిన విషయం తెలిసిందే.మొదట రచయితగా కెరియర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఇలా జోనర్ ఏదైనా దానిలో త్రివిక్రమ్ మార్క్ పక్కాగా కనిపిస్తుంది.ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ( Harika and Hasini Creations )అధినేత సూర్యదేవర రాధాకృష్ణకు( Suryadevara Radhakrishna ) ఆప్తుడు అయిన త్రివిక్రమ్ ఈ బ్యానర్‌లో చాలా సినిమాలు చేశారు.
ఇక ఈ బ్యానర్‌కు అనుబంధంగా ఏర్పడిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి సినిమాలు నిర్మించడానికి తన భార్య సాయి సౌజన్యను త్రివిక్రమ్ రంగంలోకి దించారు.తాజాగా ఆయన తన భార్య సాయి సౌజన్యను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ స్థాపించి నిర్మాత సీట్లో సౌజన్యను కూర్చోబెట్టారు త్రివిక్రమ్.
ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాల ప్రస్తుతం త్రివిక్రమ్ భార్య పేరు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది.అసలు ఎప్పుడూ మీడియా ముందుకు రాని సాయి సౌజన్య ఇప్పుడు తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి బయటకు వస్తున్నారు.ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి సౌజన్య.
కుమారుడు రిషి మనోజ్( Rishi Manoj ) ప్రస్తావన తీసుకొచ్చారు.త్రివిక్రమ్ కుమారుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయాన్ని సాయి సౌజన్య ఇటీవల ఖరారు చేశారు.రిషికి దర్శకత్వం అంటే ఆసక్తి ఉందని చెప్పారు.
ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలో ప్రస్తుతం రిషి తెలుసుకుంటున్నాడని ఆమె తెలిపారు.దాంతో త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న విషయం కన్ఫామ్ అయ్యింది.
త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ పెద్దగా ఎవరికీ తెలీదు.సోషల్ మీడియాలో అతడి అకౌంట్లు కూడా ప్రైవేట్ మోడ్‌లో ఉంటాయి.
అతడి ఫొటోలు కూడా ఎప్పుడు బయటికి రాలేదు.అయితే, ప్రస్తుతం రిషి మనోజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోను సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.విశాఖపట్నం విమానాశ్రయంలో సాయి సౌజన్య, రిషి మనోజ్‌తో కలిసి రాజా తీసుకున్న సెల్ఫీ అది.ఈ ఫొటోలో రిషి మనోజ్‌ను చూసిన నెటిజనులు అచ్చం నాన్నలానే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy