సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్( SreeLeela ) లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే కృష్ణ గారి జయంతి సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను రిలీజ్ చేసారు.

దీనికి అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఈ సినిమా మేకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోనుంది అని తెలుస్తుంది.ఈ కొత్త షెడ్యూల్ చాలా లాంగ్ గా ప్లాన్ చేసారని టాక్.
ఈ షెడ్యూల్ తో మహేష్ బర్త్ డేకు కావాల్సిన టీజర్ అయితే రెడీ అయిపోతుంది అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా. థమన్( Thaman S ) సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఈ లోపులోనే వీలైనంత ఫాస్ట్ గా సినిమా పూర్తి చేయాలని త్రివిక్రమ్, మహేష్ ప్లాన్ చేసుకున్నారు.చూడాలి ఈ షెడ్యూల్ ఎప్పటికి ముగుస్తుందో.ఇక ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది.అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు రాగా రెండు కూడా డిఫరెంట్ గా తెరకెక్కాయి.
అతడు బ్లాక్ బస్టర్ అయ్యింది.కానీ ఖలేజా ప్లాప్ గా నిలిచింది.
అయిన మహేష్ నటనలోని వేరియేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.మరి ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కానుంది.
ఈసారి ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.







