ఫైనల్ అప్డేట్.. గుంటూరు కారం షూట్ అప్పటికి పూర్తి చేయనున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరో 15 రోజుల్లో మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ).ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడు రికార్డులు బద్దలు కొడదామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.దీంతో షూట్ ఇంకా ఎంత బాలన్స్ ఉంది అనే విషయంలో తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమా షూట్ మొత్తం ఈ వారం గ్యాప్ లోనే పూర్తి చేయనున్నాడని తెలుస్తుంది.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఈ నెల 28 నాటికీ షూట్ మొత్తం పూర్తి చేసుకోనుందట.

Advertisement

మొత్తానికి ఈ నెలలోనే మహేష్ బాబు సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి ప్రమోషన్స్ లో బిజీ కానున్నట్టు టాక్.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela) , మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు