గుడివాడలో దారుణం.. భార్యను కత్తితో పొడిచి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త..!

దంపతుల మధ్య ఒకసారి అనుమానం మొదలైంది అంటే ఆ అనుమానం చివరికి కుటుంబాన్ని నాశనం చేస్తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.భార్యాభర్తల మధ్య ఏదైనా అనుమానం ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాలి.

 Atrocity In Gudivada Husband Who Stabbed His Wife And Thena Committed Suicide ,-TeluguStop.com

అలా కాకుండా ఆ అనుమానం అలాగే ఉందంటే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎలాంటి దారుణాల కైనా పాల్పడతాడు అనడానికి ఈ సంఘటన నిదర్శనం.ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో భార్యను కత్తితో పొడిచి ఆపై తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లోని గుడివాడలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Andhra Pradesh, Gudivada, Rama Lakshmi, Suryanarayana-Latest News - Telug

వివరాల్లోకెళితే.గుడివాడకు చెందిన రామలక్ష్మికి( Rama Lakshmi ), భీమవరానికి చెందిన సూర్యనారాయణకు( Suryanarayana ) ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఒక కుమారుడు సంతానం.

వివాహం తర్వాత వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగింది.అయితే ఒక ఏడాది నుంచి సూర్యనారాయణకు భార్య రామలక్ష్మి పై అనుమానం కలగడంతో ఇక తరచూ వేధించేవాడు.

రామలక్ష్మి పై విచక్షణారహితంగా దాడి చేసేవాడు.పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయతీ చేసి, దంపతులకు నచ్చచెప్పి కాపురానికి పంపించారు.

అయితే సూర్యనారాయణ ప్రవర్తనను ఎలాంటి మార్పు రాకపోగా.ఇంకా భార్యను రోజురోజుకు వేధించడం అధికం కావడంతో రామలక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త పై ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది.

Telugu Andhra Pradesh, Gudivada, Rama Lakshmi, Suryanarayana-Latest News - Telug

ఆదివారం రామలక్ష్మి కుటుంబ సభ్యులంతా పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సూర్యనారాయణ అక్కడికి వచ్చి భార్య రామలక్ష్మిని కత్తితో ఏకంగా 12సార్లు పొడిచాడు.రామలక్ష్మి అరుపులు విన్న ఆమె తండ్రి అడ్డుగా రావడంతో అతనిపై కూడా అల్లుడు కత్తితో దాడి చేశాడు.ఆ తర్వాత సూర్యనారాయణ పురుగుల మందు తాగాడు.చుట్టుపక్కల ఉండే స్థానికులంతా ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా భార్య, భర్త ఇద్దరు చనిపోయారు.రామలక్ష్మి తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటన ఆ రెండు కుటుంబాలను విషాదఛాయలను నింపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube