మహేష్ - త్రివిక్రమ్ కలిస్తే.. పాపం నిర్మాతకు కష్టాలేనా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ) ఈ సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసారో తెలియదు కానీ అప్పటి నుండి వాయిదా పడుతూనే ఉంది.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తప్పుకుని జనవరిలో స్టార్ట్ అవ్వగా రెండు షెడ్యూల్స్ చేయగానే మళ్ళీ సమ్మర్ ముందు ఆగిపోయింది.

ఇక ఈ మధ్యనే స్టార్ట్ చేసి మరో రెండు షెడ్యూల్స్ చేసారు.

అయితే షెడ్యూల్స్ అయితే పూర్తి అవుతున్నాయి కానీ సినిమా మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు.ఇప్పుడే కాదు ఈ క్రేజీ కాంబో ఇంతకు ముందు రెండుసార్లు కలిశారు.అప్పుడు అతడు సినిమాకు రెండేళ్లు, ఖలేజా సినిమాకు( Khaleja ) మూడేళ్ళ సమయం పట్టింది.

ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కూడా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది.

Advertisement

ఈ సినిమా స్టార్ట్ అయ్యాక కెజిఎఫ్ మాస్టర్స్ తో తీసిన ఫైట్ సీన్స్ ను పక్కన పెట్టేసి వారిని తప్పించారు.ఆ తర్వాత పూజా హెగ్డేతో( Pooja Hegde ) తీసిన సీన్స్ సైతం పక్కన పెట్టేసారు.ఆమెకు కూడా సెటిల్ చేసేసారు.

మళ్ళీ మధ్యలో థమన్ తో వివాదం అని తెరపైకి వచ్చింది.ఇక మహేష్ కు నచ్చలేదని ముందు తీసిన సీన్స్ ను పక్కన పెట్టి కొత్తగా ఫ్రెష్ గా కథను రాసి ఎట్టకేలకు మళ్ళీ మహేష్ ను ఒప్పించాడు.

మరి ఇలా వరుస సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సినిమా నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.వరుసగా సమస్యలతో సినిమా ఒక కొలిక్కి మాత్రం రావడం లేదని నిర్మాత వాపోతున్నారట.

మరి మహేష్ - త్రివిక్రమ్ కలిస్తే ఎప్పుడైనా చుక్కలు చుపించాల్సిందేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇన్ని సమస్యల మధ్య వచ్చే ఏడాది 2024 సంక్రాంతి రిలీజ్ కూడా కష్టమే అంటున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement

తాజా వార్తలు