ఆసక్తిగా ఉన్న త్రివిక్రమ్.. అస్సలు వద్దంటున్న తారక్

యంగ్ టైగర్

ఎన్టీఆర్

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో

ఆర్ఆర్ఆర్

చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

ఇక మరో హీరో మెగా పవర్ స్టార్

రామ్ చరణ్

కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.

Trivikram Interested In Pan India Movie But Not NTR-ఆసక్తిగా ఉ

మాటల మాంత్రికుడు

త్రివిక్రమ్

డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా ప్రారంభించారు.అయితే రెగ్యులర్ షూటింగ్‌కు మాత్రం ఇంకా సమయం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.

పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

Advertisement

కానీ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్

పాన్ ఇండియా

మూవీలో నటిస్తున్న తారక్, తన నెక్ట్స్ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా మలచాలని తారక్ చూడట్లేదు.దీంతో తన కెరీర్ 30వ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ మెచ్చే రీతిలో ఉంటే చాలని ఆయన అనుకుంటున్నాడు.

మరి ఈ సినిమా పాన్ ఇండియాగా వస్తుందా లేక ఫక్తు తెలుగు సినిమాగా వస్తుందా అనే చూడాలి.

Advertisement

తాజా వార్తలు