ఈ డిసెంబర్ మంత్ లో బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను సైతం షేక్ చేసిన సినిమా ఏది అంటే యానిమల్ అనే చెప్పాలి.”యానిమల్”( Animal ) సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించారు.ఇక మరో బ్యూటీ కూడా ఈ సినిమాతో సెన్సేషన్ అయ్యింది.
ఆమె ఎవరో చాలా మందికి తెలుసు.యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యిన బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).ఈ సినిమాలో సెకండాఫ్ లో రణబీర్ లవర్ జోయగా తన నటనతో, అందంతో మెస్మరైజ్ చేసింది.మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న కంటే కూడా ఈ భామకు ఎక్కువ పేరు వచ్చింది.
మరి తాజాగా ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ఈ భామ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఈమెను బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా సౌత్ లో ఏ హీరోతో వర్క్ చేయాలని ఉందని అడుగగా ఈ బ్యూటీ క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ పేరు చెప్పింది.తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ (NTR) అంటూ తనతో వర్క్ చేయాలని ఉందని చెప్పింది.
దీంతో ఈ కామెంట్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేసేస్తున్నారు.