'గాజు గ్లాస్ ' నష్టం తీవ్రంగానే ఉండబోతోందే ? టీడీపీలో వణుకు 

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును( Glass ) జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కేటాయించగా, మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించడం సంచలనంగా మారింది.

ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.

అయితే జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, టిడిపి 144 స్థానాల్లో పోటీ చేస్తుంది.మిగిలిన చోట్ల బీజేపీ తమ అభ్యర్థులను పోటీకి దింపింది .అయితే టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ( Janasena party )ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు దక్కడం ఆందోళన పెంచుతోంది.అది కూడా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన రెబల్ అభ్యర్థులకు ఆ గుర్తు దక్కడంతో, జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

సినిమాల్లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును పవన్ కళ్యాణ్ బాగా ప్రమోట్ చేశారు.జనాల్లోకి ఈ గుర్తు బాగా వెళ్ళిపోయింది.

అయితే ఇప్పుడు ఎన్నికలు ఈవీఎంలతోనే జరగబోతుండడం తో ,ఓటర్లు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారని, జనసేన అభిమానులు సైత కన్ఫ్యూజ్ అయ్యి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తే టిడిపి బిజెపి అభ్యర్థుల గెలుపోటములపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

Trembling In Tdp As The Loss Of Glass Is Going To Be Severe
Advertisement
Trembling In Tdp As The Loss Of Glass Is Going To Be Severe-గాజు గ్

గుర్తును పోలిన గుర్తులు ఉంటేనే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.అటువంటిది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు మరో అభ్యర్థికి ఇస్తే.జనసేన అభిమానులు, ఓటర్లు కచ్చితంగా కన్ఫ్యూజ్ కు గురవుతారని, ఆ గాజు గ్లాస్ పైనే ఓటు వేసే అవకాశం ఉందనే విశ్లేషణతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

నామినేషన్ ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత, రిటర్నింగ్ అధికారులు ఏపీలోని 5 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.

Trembling In Tdp As The Loss Of Glass Is Going To Be Severe

దీని ద్వారా నియోజకవర్గంలో రెండు మూడు వేల ఓట్లు గాజు గ్లాసు గుర్తుపై పడినా, దాని ప్రభావం  తీవ్రంగా ఉంటుందని, అలాగే అతి తక్కువ మెజారిటీతో గెలిచే స్థానాలు ఏపీలో అనేకం ఉన్నాయని, వెయ్యిలోపు మెజారిటీ వచ్చే నియోజక వర్గాల్లో గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందనే ఆందోళన కూటమి పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది.అందుకే గుర్తు విషయంలో ఓటర్లకు అర్థమయ్యే రీతిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.ఇప్పటికే ఈ గుర్తు విషయమే ఎన్నికల కమిషన్ కు, ఫిర్యాదు చేయడంతో పాటు, హైకోర్టులోను పిటిషన్ దాఖలు చేసింది జనసేన పార్టీ.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు