వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ జనసేన పార్టీలు( TDP Janasena parts ) జట్టు కట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు అధినేతలు ప్రకటించారు కూడా ఇక మిగిలింది సీట్ల పంపకాలే.
అందువల్ల ప్రస్తుతం సీట్ల సర్ధుబాటుపై పవన్ చంద్రబాబు ( Chandrababu )దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పోటీ చేసే స్థానాలను ముందుగానే ప్రకటించి ఆ తరువాతే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాలని భావిస్తున్నారట అధినేతలు.
అందులో భాగంగానే ఇటీవల పవన్ మరియు చంద్రబాబు భేటీ అయ్యారు కూడా.
ఈ భేటీలో కీలక విషయాలపై అధినేతలిద్దరూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నాళ్లు జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతూ వచ్చారు.ఎట్టకేలకు 20 సీట్లు జనసేన పార్టీకి కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
అయితే ఉత్తరాంధ్రలో జనసేన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉందని మరో పది సీట్లు పవన్( Pawan Kalyan ) డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే అందుకు చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.
మొత్తం మీద 30 సీట్లు పొత్తులో భాగంగా కేటాయిస్తే టీడీపీకి నష్టం తప్పదనే అభిప్రాయంతో టీడీపీ శ్రేణులు ఉన్నారట.
ఎందుకంటే జనసేన పార్టీకి( Janasena party ) ఉన్న బలం ఎంతమేర ప్రభావం చూపుతుందనే మిస్టరీగా ఉన్న అంశమే.ఇటీవల తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన జనసేన కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది.దాంతో జనసేన పార్టీని నమ్మి 30 కట్టబెడితే నష్టపోతామేమో అనే భయం టీడీపీ అధినాయకత్వంలో ఉన్నట్లు వినికిడి.
అందుకే 20 సీట్లలోనే జనసేనకు సర్దుబాటు చేసే ఆలోచనలో చంద్రబాబు ( Chandrababu )ఉన్నారట.మరి అందుకు పవన్( Pawan Kalyan ) సుముఖత వ్యక్తం చూపుతారా అనేది ప్రశ్నార్థకమే.
ఇదిలా ఉంచితే సిఎం అభ్యర్థి విషయంలో కూడా ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నర సంవత్సరాలు సిఎం పదవిలో ఉండేలా ప్రతిపాదనలు జరుగుతున్నాయట.
మరి ఇరు పార్టీలు వీటిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాయో చూడాలి.