ఖమ్మం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చెందారు.

ఈ ఘటన పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో జరిగింది.గ్రామానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మృతులు భార్యాభర్తలు వెంకట కృష్ణారావు, సుహాసిని, వారి కుమార్తె అమృతగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అప్పుల బాధ భరించలేకనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?