విషాదం.. నిమజ్జనంలో అపశృతి.. విగ్రహం మీదపడి ఇద్దరు మృతి..

ప్రపంచమంతటా వినాయక చవితి( Vinayaka Chavithi ) అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

చిన్న,పెద్ద, ధనికులు, పేదవారు అని తేడాలేకుండా ఇలా ప్రతి ఒక్కరూ కూడా గణేష్ చవితి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

అయితే, గణేష్ చవితి వేడుకలలో పలుచోట్ల అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.హైదరాబాద్ మహానగరంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా వినాయక మండపం కాలి బూడిదైన సంఘటన అందరూ చూశారు.

దీంతో వినాయక మండపాలు ఉన్న ప్రదేశంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి.అయితే.

, ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వినాయక నిమర్జనాలు( Ganesh Immersion ) మొదలైపోయాయి.

Advertisement

ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో నిమర్జనాల సమయంలో అప్రమత్తంగా లేకపోతే ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.అలాంటి సంఘటననే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో( Kadapa District ) చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఊహించని ఘోరం చోటు చేసుకుంది.

వినాయకుని విగ్రహం నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీద పడి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.మృతులను వంశీ, రాజులుగా గుర్తించారు అక్కడివారు స్థానికులు.వినాయక నిమర్జనం సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు తెలియజేస్తున్న కానీ.

ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఏడాది.ఏదైమైనా ఎలాంటి అశ్రద్ధ వహించకుండా ఇలాంటి వాటికి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యం.

ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?
కరెంట్ తీగలపై కోతి పిల్ల డేంజరస్ స్టంట్స్‌.. తల్లి ఏం చేసిందంటే..

లేకపోతే ఇలాంటి సంఘటనల వల్ల ఇంట్లోని వారు అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు