పొడి జుట్టుతో విసుగెత్తిపోతున్న వారికి టాప్ అండ్ బెస్ట్ హైడ్రేటింగ్ రెమెడీ ఇదే!

పొడి జుట్టు( Dry Hair ). చాలా మంది కామ‌న్ గా ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్ల‌మ్స్ లో ఒక‌టి.

జుట్టు పొడిగా మార‌డానికి కార‌ణాలు అనేకం.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆహారాపు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించ‌డం త‌దిత‌ర కార‌ణ‌ల వ‌ల్ల జుట్టు పొడి పొడిగా మారుతుంది.

ఇటువంటి హెయిర్ ను మెయింటైన్ చేయ‌డం చాలా క‌ష్ట‌త‌రంగా మారుతుంటుంది.ఖ‌రీదైన షాంపూలు, కండిషనర్లు వాడినా కూడా వాటి ఫ‌లితం అంతంత మాత్రంగానే ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే పొడి జుట్టుతో విసుగెత్తిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

Advertisement

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీ( Home Remedy ) మీకు చాలా బాగా వ‌ర్కౌట్ అవుతుంది.పొడి జుట్టును హైడ్రేట్ చేయ‌డానికి మ‌రియు తేమ‌గా ఉంచ‌డానికి ఈ రెమెడీ బెస్ట్ వ‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక అవ‌కాడో( Avocado)ను తీసుకుని స‌గానికి క‌ట్ చేసి లోప‌ల ఉండే ప‌ల్ప్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్ లో అవ‌కాడో ప‌ల్ప్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వైట్ రైస్‌, రెండు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్( Aloevera Gel ) మ‌రియు రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని స్కాల్ప్‌తో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను ఉప‌యోగించి శుభ్రంగా త‌ల‌స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే అద్భుత ఫ‌లితాలు పొందుతారు.అవ‌కాడో, వైట్ రైస్‌, అలోవెర, ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

పొడిగా మారిన జుట్టును రిపేర్ చేస్తాయి.కురుల‌కు చ‌క్క‌ని తేమ‌ను అందిస్తాయి.

Advertisement

జుట్టు స్మూత్‌గా, సిల్కీగా( Smooth and Silky Hair ) మెరిసేలా ప్రోత్స‌హిస్తాయి.కాబ‌ట్టి పొడి జుట్టుతో బాధ‌ప‌డుతున్న‌వారు త‌ప్ప‌కుండా ఈ హెయిర్ మాస్క్ ను ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు