రేపు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల..!

ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ( BJP ) రేపు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

‘సంకల్పపత్ర’( Sankalpa Patra ) పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ప్రకటించనుంది.అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదలే ప్రధాన అజెండాగా బీజేపీ మ్యానిఫెస్టో ఉండనుంది.

కాగా ఈ మ్యానిఫెస్టోను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్( Rajnath Singh ) నేతృత్వంలోని కమిటీ రూపొందించింది.ప్రజల నుంచి సుమారు 15 లక్షల సలహాలు, సూచనలు తీసుకున్న కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మ్యానిఫెస్టో రూపకల్పన చేసిందని తెలుస్తోంది.

నమో యాప్ ద్వారా సంకల్పపత్ర కోసం సుమారు నాలుగు లక్షలకు పైగా ప్రజలు సలహాలు, సూచనలు చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు