టాలీవుడ్ కి కొత్త కష్టం వచ్చింది.. వచ్చే రెండేళ్లు ఇబ్బందే

టాలీవుడ్ కరోనా సమయంలో కూడా మంచి వసూళ్లు సాధించి అన్ని ఇండియన్ సినీ పరిశ్రమల్లోకి మేటి అన్నట్లుగా నిలిచింది.

కానీ ఇప్పుడు టాలీవుడ్ ను ఒక సమస్య తీవ్రంగా వేదిస్తుంది.

ఆ సమస్య నుండి వచ్చే రెండేళ్లలో బయట పడే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు సమస్య ఏంటి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్‌ హీరోయిన్స్ సమస్య కొరవడింది.

స్టార్‌ హీరోయిన్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లు ఒకప్పుడు తమన్నా.సమంత.

శ్రియ .త్రిష.ఇలియానా.

Advertisement

నయనతార.

వీళ్లు ఇప్పుడు సీనియర్ లు అయ్యారు.వీరికి తగ్గ పాత్రలు వస్తున్నాయి కానీ కొత్తగా స్టార్‌ హీరోయిన్స్ ఇతర హీరోయిన్స్ ను ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దొరికే పరిస్థితి లేదు. పూజా హెగ్డే కెరీర్ దాదాపుగా ఖతం అయినట్లే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరో వైపు టాలీవుడ్ లో అనూహ్యంగా స్టార్‌ అయిన రష్మిక మందన్నా కూడా ఇప్పుడు పెద్దగా సందడి చేయలేక పోతుంది.

ఆమె భారీగా పారితోషికం పెంచడం వల్ల చేతి వరకు వచ్చిన నాలుగు అయిదు ఆఫర్లు చేజారాయి.దాంతో ఆమె కెరీర్ విషయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఆ తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోవడానికి పెద్ద హీరోయిన్‌.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

స్టార్‌ హీరోయిన్‌ అనే వారు లేరు అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మృణాల్‌ ఠాకూర్ టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

Advertisement

ఈమె బాలీవుడ్‌ నుండి సీతారామం సినిమా తో వలస వచ్చింది.ప్రస్తుతం నాని సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోల దృష్టిని మృణాల్ ఆకర్షిస్తుందేమో చూడాలి.మొత్తానికి టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు హీరోయిన్స్ కొరత ఏర్పడింది.

ఈ కొరత తీరేది ఎప్పుడు అంటే సమాధానం లేదు.

తాజా వార్తలు