ఏదైనా ఒక సినిమా విడుదలవుతుంది అంటే ఆ చిత్రంలో తమ అభిమాన హీరో ఎలా నటించాడు, ఎలాంటి అద్భుతమైన డైలాగ్స్ చెప్పాడు, ఎంత బాగా ఫైట్స్ చేశాడు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు.కానీ ఒక సినిమా విడుదలై థియేటర్ కి వెళ్లిన తర్వాత సగం సినిమా వరకు అసలు హీరో ఎలాంటి డైలాగ్స్ చెప్పకపోతే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ కి గురవుతారు.
కానీ అలాంటి అవకాశం లేకుండా టాలీవుడ్ లోనే టాప్ హీరోలు కొంతమంది ఎలాంటి డైలాగ్స్ లేకుండా హాఫ్ సినిమా వరకు కూడా నటించి రికార్డు సాధించారు.వారు ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ,( Superstar Krishna ) నందమూరి తారక రామారావు,( Nandamuri Taraka Ramarao ) మరియు చిరంజీవి.
( Chiranjeevi ) అయితే డైలాగ్స్ లేకుండా ఈ ముగ్గురు హీరోలు ఎందుకు నటించారు అనే ప్రశ్న మీకు రావచ్చు.ఆ సినిమా పేరు చెప్తే విషయం మీకు ఇట్టే అర్థమవుతుంది.

ఈ ముగ్గురు ఏరికోరి ఎంచుకొని చేసిన ఆ క్యారెక్టర్ పేరు టార్జాన్. దీంతో మీకు అసలు విషయం ఇప్పటికే అర్ధం అయిపోయి ఉండవచ్చు.ఇలా టార్జాన్ పాత్రలో( Tarzan Role ) నటించడంతోనే వారికి ఎక్కువ శాతం మాట్లాడే అవకాశం దక్కలేదు.అయితే మొదటగా టార్జాన్ పాత్ర పోషించింది మాత్రమే కృష్ణ గారే.1967లో ఇద్దరు మొనగాళ్లు( Iddaru Monagallu ) చిత్రంలో కృష్ణ మొట్టమొదటిసారి టార్జాన్ పాత్ర పోషించారు.ఈ సినిమాకి విఠలాచార్య దర్శకత్వం వహించారు.ఇక ఎన్టీ రామారావు కూడా టార్జాన్ పాత్రలో నటించారు.1978లో ఆయన నటించిన రాజపుత్ర రహస్యం( Rajaputra Rahasyam ) అనే సినిమాలో టార్జాన్ గా నటించడంతో మొదటి పార్ట్ పూర్తిగా మాటలు లేకుండానే నటించాల్సి వచ్చింది.

ఈ సినిమాకి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించగా హీరోయిన్ గా జయప్రద నటించింది.చివరిగా మెగాస్టార్ చిరంజీవి అడవి దొంగ( Adavi Donga Movie ) సినిమాలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 1985లో టార్జాన్ పాత్ర పోషించారు.వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొట్టమొదటి సినిమా కావడం విశేషం.ఇక చిరంజీవికి హీరోయిన్ గా రాధ నటించగా, చిరు చేసిన ఏకైక టార్జాన్ చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక పై రెండు సినిమాలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సాంఘిక నేపథ్యంలో తెరకెక్కగా, ఎన్టీ రామారావు మరియు కృష్ణ జానపద నేపథ్యంలో ఇలాంటి సినిమాలో నటించారు.ఇలా టార్జాన్ పాత్ర పోషించే అవకాశం దక్కిన ముగ్గురు హీరోలు వీరు మాత్రమే.
ఇంకా మరొక విశేషం ఏమిటి అంటే కృష్ణ నటించిన సినిమా బ్లాక్ అండ్ వైట్ స్కోప్ లో తెరకెక్కగా, ఈస్ట్ మన్ కలర్ లో ఎన్టీఆర్ నటించిన రాజపుత్ర రహస్యం వచ్చింది.ఇక కలర్ లో అడవి దొంగ సినిమాను తీశారు.