ఈ 10 మంది హీరోలకు తండ్రి ఒక్కడే కానీ తల్లులు మాత్రం వేరు

మనం ఎన్నో సినిమాల్లో చూసుంటాం.ఒకే తండ్రి ఇద్దరు భార్యలు.

అయితే తండ్రి ఒకరైన ఇద్దరు తల్లులకు పుట్టిన పిల్లలు ఒకరినొకరు ద్వేషించుకోవడం.

వాళ్ళు పెరిగే కొద్దీ శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది.

అయితే మన తెలుగు సినిమా చరిత్రలో రెండో పెళ్లిచేసుకున్న టాప్ హీరోల పిల్లలు చాలామంది అలా ఒకరిమీద ఒకరు యుద్దానికి దిగకుండా కలసిమెలసి ఉంటున్నారు.ఎంతో అన్యోన్యంగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు సో, అలా ఒకే తల్లికి పుట్టకపోయిన కలసి మెలసి ఉంటున్న మన సెలబ్రిటీ హీరోలు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Tollywood Heros Siblings Unknown Details, Akkineni Nagarjuna, Nagachaitanya, Akh

ఈ లిస్ట్ లో ముందున్న సెలబ్రిటీలు అక్కినేని నాగార్జున కొడుకులైన నాగచైతన్య అండ్ అఖిల్.ఇందులో నాగచైతన్య నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి కుమారుడు అయితే అఖిల్ వచ్చేసి నాగార్జున ప్రేమించి పెళ్లిచేసుకున్న అమల కొడుకు.అయినా కూడా వీళ్లిద్దరు ఎప్పుడు కలసి మెలసి ఉంటారన్న విషయం మనందరికి తెలిసిందే.

Tollywood Heros Siblings Unknown Details, Akkineni Nagarjuna, Nagachaitanya, Akh
Advertisement
Tollywood Heros Siblings Unknown Details, Akkineni Nagarjuna, Nagachaitanya, Akh

ఈలిస్ట్ లో హరికృష్ణ గారి ఇద్దరు ముద్దులు కొడుకులైన కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు.హరికృష్ణ గారు ఆఫిసిఅల్ గానే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇందులో మొదటి భార్యకు కళ్యాణ్ రామ్, రెండొవ భార్యకు జూనియర్ ఎన్టీఆర్ లు పుట్టారు.

అయితే వీళ్లిద్దరు ఎప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు.ఇక ఈ మద్యనే హరికృష్ణ గారు చనిపోయాక వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఇంకాస్త పెరిగిందని చెప్పొచ్చు.

Tollywood Heros Siblings Unknown Details, Akkineni Nagarjuna, Nagachaitanya, Akh

ఇక ఈ లిస్టులో మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి ముగ్గురు పిల్లల గురించి కూడా మాట్లాడుకోవాలి.ముగ్గురిలో విష్ణు, లక్ష్మీ లు… మోహన్ బాబు మొదటి భార్య అయిన విద్య దేవి గారికి జన్మిస్తే.మనోజ్ మాత్రం మోహన్ బాబు గారి రెండో భార్య నిర్మల దేవి గారికి జన్మించారు.

అయినా వీళ్ళు ముగ్గురు ఒకతల్లికి పుట్టలేదంటే ఎవరు నమ్మరు.అంతలా వీళ్ళ మధ్య అనుబంధం ఉంటుంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఇక కృష్ణ గారి ఇద్దరబ్బాయిలైనా నరేష్ అండ్ మహేష్ కూడా ఒక తల్లికి పుట్టకపోయిన ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు.

Advertisement

ఇక ఈ లిస్ట్ లో అప్పటి టాప్ హీరోయిన్స్ అయినా నగ్మా అండ్ జ్యోతిక కూడా ఉన్నారు.వీళ్ళు కూడా ఒకతల్లికి పుట్టిన కూతుర్లు కాకపోయినా అటు రీల్ లైఫ్ లో ఇటు రియల్ లైఫ్ లో ఒకరికొకరు సహాయం చేస్కుంటూ కలిసిమెలసి ఉంటారు.

ఇక ఒకప్పటి హీరో ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా విజయ్ కుమార్ గారు కూడా రెండు పిల్లలు చేసుకున్నారు.వీరికి మొత్తం నలుగురు పిల్లలు.మొదటి భార్యకు కొడుకు అరుణ్ విజయ్ ఇప్పుడు తమిళ్ లో టాప్ హీరో అండ్ రెండొవ భార్యకు ముగ్గురు పిల్లలు అందులో ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు.

వీళ్లిద్దరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉంటారు.

ఇక శ్రీదేవి భర్త బోణి కపూర్ గురించి మనందరికి తెలిసిందే.ఈయనకు కూడా ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు.అయితే మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ ఇప్పుడు హీరోగా రాణిస్తుంటే రేండోవ భార్య శ్రీదేవికి జాన్వీ కపూర్ అనే కూతురు ఉంది.

ఇప్పుడు శ్రీదేవి లేకపోయినా సొంత అన్నలా అర్జున్ కపూర్ జాన్విని బాగా చూసుకుంటాడు.ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.అమ్రితా సింగ్ అనే అమ్మాయిని చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని.సారా అలీఖాన్ మరియు ఇబ్రహీం లకు జన్మనిచ్చాడు.

ఆ తర్వాత కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకుని సారా మరియు ఇబ్రహీం లకు ఒక బ్రదర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇప్పుడు కరీనా మళ్ళీ కడుపుతో ఉంది.

తాజా వార్తలు