బాలీవుడ్ పై ఈ ఇద్దరి ముద్దుగుమ్మలకు అంత ప్రేమా... ?

టాలీవుడ్ లో అవకాశాలు దొరకడం లేదో లేక నార్త్ ని వదిలి పెట్టి రావాలి అని అనిపించడం లేదో ఏమో కానీ తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు హీరోయిన్లు ఇపుడు కేవలం బాలీవుడ్ చిత్రాల పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు.

ఇంతకీ వారెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ మరియు రాశీ కన్నా.

ఈ ఇద్దరు హీరోయిన్లు ఇపుడు ఫ్రెష్ గా తెలుగులో సినిమాలేవీ చేయడం లేదు.ప్రస్తుతం నార్త్ లోనే బాగా బిజీ అయిపోయారు.

రకుల్ ప్రీత్ సింగ్ అయితే వరుస హిందీ చిత్రాలతో అక్కడే సెటిల్ అయిపోయింది.బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ తో రిలేషన్ కొనసాగిస్తూనే అక్కడ బిజీ హీరోయిన్ గా స్పీడ్ పెంచింది.

నిజం చెప్పాలంటే ఇక్కడ టాలీవుడ్ రకుల్ ని పెద్దగా మిస్ అవుతున్నట్లు కనిపించడం లేదు.అందుకే ఆమె అక్కడే సెటిల్ అయ్యారన్నది టాక్.

Advertisement

టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎవరు కూడా రకుల్ ని తమ సినిమాలలో పాత్రల కోసం సంప్రదించడానికి రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు.రకుల్ చేతిలోనూ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం.అందుకే కాబోలు ఇక్కడ మనసున్న బాలీవుడ్ సెట్స్ ను దాటి రాలేకపోతుంది రకుల్.

అటాక్ తర్వాత ఆమె నటించిన రన్ వే 34 చిత్రంతో అక్కడ సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.ఆ తర్వాత హిందీలో మిషన్ సిండ్రిల్లా, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి ప్రాజెక్టు రకుల్ చేతిలో ఎలాగో ఉండనే ఉన్నాయి.

ప్రస్తుతానికి కెరియర్ పరంగా రకుల్ కి డోకా ఏమి లేదు.కానీ తెలుగు తెరను మాత్రం బాగా మిస్స్ అవుతున్నట్లు ఉంది.మరి ఆమె అభిమానులు కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పాల్సిందే.

ఇక రాశి ఖన్నా విషయానికి వస్తే, ఈమె పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంది.బాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఎప్పుడో సౌత్ లో ఒప్పుకున్న పక్కా కమర్షియల్, తిరుచిత్రాంబలం, సర్దార్ వంటి చిత్రాలు ఎండింగ్ దశలో ఉన్నాయి.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

తాజాగా ఆమె చేతిలో సౌత్ ప్రాజెక్టు లు ఏమి లేనట్లు సమాచారం.ఇక్కడ పెద్దగా ఆఫర్లు కూడా కనీసం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమ్మడు బాలీవుడ్ లో క్లిక్ అవ్వాలని తెగ ట్రై చేస్తోందట.

Advertisement

హిందీలో సిద్ధార్ధ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న యోధ తర్వాత రాజ్ అండ్ డికె వెబ్ సిరీస్ లో ఆమెకు అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.అంతే కాకుండా మరో కొందరి హిందీ స్టార్స్ ఆఫర్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఒకరిద్దరు ఇచ్చేలా ఉన్నారని వినికిడి.ఇలా ఈ ఇద్దరు కూడా సౌత్ ను వదిలి నార్త్ లోనే అతుక్కుపోయేలా ఉన్నారు.

తాజా వార్తలు