చనిపోయిన సెలబ్రిటీస్ ని తెరపై చూపిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ !

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రకరకాల ట్రెండ్స్ వైరల్ అవుతున్నాయి.

అందులో ఒకటి చనిపోయిన మన పాత హీరోలను మరో మారు ఇప్పటి టెక్నాలజీ వాడి వెండితెరపై చూపించి దానిని ప్రమోషన్ చేసుకోవడం.

ఇది ఒక రకంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి టాలీవుడ్ డైరెక్టర్ వేస్తున్న ఒక ఎత్తుగడ అని చెప్పొచ్చు.అలా చనిపోయిన మన సీనియర్ ఆర్టిస్టులను వెండితెరపై చూడాలని కోరుకునే అప్పటి తరం హీరోల అభిమానులు కూడా ఉంటారు.

అలా వారికి మరోసారి అభిమాన నటుడిని చూసే అవకాశం దొరుకుతుంది.అలాగే స్క్రీన్ పై వారిని చూపించి ప్రమోషన్ కూడా చేసుకుంటారు.

ఇక ఈ మధ్య ఈ ట్రెండు మరి ఎక్కువగా కనబడుతుంది మరి అలా తెరపై కనిపించిన అలనాటి స్టార్ నటినటులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

అప్పట్లో యమదొంగ సినిమా( Yamadonga )తో రాజమౌళి సీనియర్ ఎన్టీఆర్ ని తెలుగు తెరపై తొలిసారి గ్రాఫిక్స్ వాడి ఆవిష్కృతం చేశారు.అలా ఒక్కసారిగా సీనియర్ ఎన్టీఆర్ ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి చూడటంతో నందమూరి అభిమానులు అయితే పండగ చేసుకున్నారు.ఇక విజయ్ హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రంలో ఇటీవల కాలంలో చనిపోయిన హీరో విజయ్ కాంత్ ని చూపిస్తున్నారు.

ఇలా విజయకాంత్ ని తమ సినిమాలో చూపించడం కోసం ఏకంగా 14 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట సినిమా టీం.దీంతోటి విజయకాంత్( Vijayakanth ) ఫ్యాన్స్ తో పాటు ఇటు విజయ్ కుమార్ ఫ్యాన్స్ కూడా తెగ ఖుషి అయిపోతున్నారు.

అలాగే హీరో విశాల్ సినిమా ఆయన మార్క్ ఆంటోనీ( Mark Antony ) చిత్రంలో సిల్క్ స్మిత ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు ఇది అప్పట్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.ఇక ఇండియన్ 2 సినిమాలో సైతం డైరెక్టర్ శంకర్ ఇటీవల చనిపోయిన కమెడియన్ వివేక్ నడిమిడి రవి వంటి వారిని చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ ట్రెండ్ తమిళ్ లో కొనసాగుతుంది.ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చనిపోయిన వారిని మాత్రమే కాదు ఆచార్య సినిమాలో చిరంజీవిని అలాగే కల్కి సినిమాలో అమితాబ్ నీ యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలా మరోమారు చూపించారు.

సీక్వెల్స్ లో అదరగొడుతున్న హీరో ప్రభాస్ మాత్రమేనా.. ఈ హీరోకు మాత్రమే అంత క్రేజ్ అంటూ?
Advertisement

తాజా వార్తలు