ఈ సెలెబ్రెటీలంత చిన్నతనం నుంచి స్నేహితులని తెలుసా.. ?

చిన్నప్పుడు ఒకే దగ్గర కలిసి చదువుకున్న ఎంతో మంది.పెద్దయ్యాక ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న సందర్భాలున్నాయి.

వారు ఏ రంగంలో స్థిరపడ్డా.ఒకే చోట కలిసినప్పుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.

అందుకు ఓల్డ్ స్టూడెంట్స్ అంతా గెట్ టు గెదర్ పేరుతో మీటవుతూ పాత మధుర గుర్తులను గుర్తు చేసుకుంటారు.పలువురు సెలబ్రిటీలు సైతం తమ చిన్ననాటి మిత్రులను కలుస్తూ ఉంటారు.

ఒకప్పుడు ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకున్న మిత్రులు సినిమా రంగంలో, వ్యాపారంలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు.అప్పట్లో కలిసి చదువుకుని ఇప్పుడు ఆయా రంగాల్లో దూసుకెళ్తున్న వారెవరో పరిశీలిస్తే.

Advertisement
Tollywood Celebrities And Business Men Who Are Friends From Childhood, Tollywood

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాహుబలి భల్లాల దేవుడు రానా చిన్నప్పటి మిత్రులే.వీరిద్దరూ చిన్నతనంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.

నాచురల్ స్టార్ నాని, బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులే.హైదరాబాదులోని ఓ స్కూల్లో ఇద్దరు కలిసి చదువుకున్నారు.

ఇద్దరు నిత్యం కలుసుకునే వారు.మంచి మిత్రులుగా ఉండేవారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం కొనసాగుతూనే ఉంది.

Tollywood Celebrities And Business Men Who Are Friends From Childhood, Tollywood
వినీత్ తెలుగులో సత్తా చాటలేక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా చిన్ననాటి మిత్రులే.ఇద్దరూ ఒకే తరగతి గదిలో కూర్చుని చదువుకున్నారు.ప్రస్తుతం ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా సత్తా చాటుతున్నారు.

Tollywood Celebrities And Business Men Who Are Friends From Childhood, Tollywood
Advertisement

ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సతీమణులు హీరోయిన్ అనుష్క శర్మ, సాక్షి ధోనీ కూడా చిన్నప్పుడు ఒకే స్కేల్లో కలిసి చదువుకున్నారు.మంచి మిత్రులుగా మెలిగే వారు.

ప్రస్తుతం వ్యాపార రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్ర కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు.మొత్తంగా చిన్ననాటి స్నేహితులు, క్లాస్ మేట్స్ ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు.ఇప్పటికీ నాటి స్నేహాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజా వార్తలు