ఈవారం బాక్సాఫీస్ జీరో.. కాస్త అయినా ఆలోచించరా?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకి దీపావళి సందర్భంగా నాలుగు ఐదు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది.

ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడడం తో వచ్చే వారం సినిమాలైనా ఆకట్టుకుంటాయేమో చూద్దాం అంటూ ప్రేక్షకులు ఈ వారం కోసం వెయిట్ చేశారు.నేడు సినిమా లేమీ విడుదల కాలేదు.

ఒకటి రెండు చిన్నా చితక సినిమా లు విడుదలైనా కూడా జనాలు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు.తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం పూర్తి గా తగ్గి పోయింది.

కాంతార సినిమా కూడా కలెక్షన్స్ తగ్గడం తో థియేటర్లన్నీ వెల వెలబోతున్నాయి.అసలు ఈ వారం మంచి ఛాన్స్ మిస్ చేసుకుని వచ్చే వారం.

Advertisement

తర్వాత వారం అంటూ సినిమా మేకర్స్ వాయిదాలు వేసారంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వారం ఒకటి రెండు చిన్న సినిమా లు విడుదల అయ్యి ఉంటే మంచి ఫలితం దక్కేది అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వస్తే ఒకే సారి అన్ని సినిమాలు వస్తున్నాయి.లేదంటే ఇలా ఖాళీ గా బాక్సాఫీస్ ని వదిలేస్తున్నారు అంటూ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలాంటి పద్ధతి ఇకనైనా మానుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు.సినిమా ల విడుదల విషయం లో నిర్మాతల మధ్య కో ఆర్డినేషన్ కనిపించడం లేదని.

ముందు ముందు అయినా ఆ కోఆర్డినేషన్ తో విడుదల ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.ఏం జరుగుతుందో చూడాలి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

మొత్తానికైతే ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ శూన్యం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు