థియేటర్లు నిండాలి అంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందేనా?

టాలీవుడ్ కి 2023 సంవత్సరం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సాగింది.మరో మూడు నెలలు మాత్రమే ఈ ఏడాది లో మిగిలి ఉన్నాయి.

 Tollywood Box Office For Dasara Festival , Tiger Nageswara Rao , Dasara Festiv-TeluguStop.com

సెప్టెంబర్ నెల లో ఏ ఒక్క సినిమా కూడా ఆహా అన్నట్లుగా సూపర్‌ హిట్‌ అవ్వలేదు.అయినా కూడా ప్రేక్షకులు వచ్చిన సినిమాలతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక మళ్లీ థియేటర్లు నిండాలి, కలకలలాడాలి అంటే కచ్చితంగా దసరా వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం దసరా కి పెద్ద ఎత్తున సినిమా లు రాబోతున్నాయి.

అక్టోబర్ లో రాబోతున్న దసరా సినిమా లు చాలా ఆశలను రేకెత్తిస్తున్నాయి.ముందు ముందు భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bala Krishna, Bollywood, Dasara Festival, Ravi Teja, Tigernageshwar, Toll

ప్రస్తుతం దసరా బరి లో బాలకృష్ణ హీరో గా కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్ర లో నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) నిలువబోతుంది.ఆ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మెల్లగా మొదలు పెడుతున్నారు.ఇక విజయ్ నటించిన లియో సినిమా కూడా దసరా బరి లో నిలువబోతుంది.

Telugu Bala Krishna, Bollywood, Dasara Festival, Ravi Teja, Tigernageshwar, Toll

తమిళ్ మూవీ అయినా కూడా లోకేష్ కనగరాజ్ సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమా ల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు సినిమా ల తో పాటు టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా లో రేణు దేశాయ్ కీలక పాత్ర లో కనిపించడం వల్ల అంచనాలు భారీ గా ఉన్నాయి.

మొత్తానికి దసరా సినిమా లతో థియేటర్లు నిండటం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube