యాంకర్ టు హీరోయిన్.. మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీలు..

వెండితెర మీదకు వెళ్లడానికి బుల్లితెర ఒక మార్గంగా భావిస్తారు చాలా మంది నటీనటుడు.

అలాగే ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్లుగా పని చేసిన చాలా మంది ముద్దు గుమ్మలు కొంతకాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్లుగా వెలిగారు.

అలా యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన బ్యూటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నిహారిక

చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా చేసింది.డ్యాన్స్ షోలో వ్యాఖ్యాతగా చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ అయ్యింది.

పెళ్లి తర్వాత సినిమాలు మానేసింది.వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.

రెజీనా

Tollywood Anchors Turns To Heroines Details, Tollywood Anchors, Anchors To Heroi
Advertisement
Tollywood Anchors Turns To Heroines Details, Tollywood Anchors, Anchors To Heroi

ఈమె కూడా తొలుత ఓ తమిళ చానెల్ లో ప్రసారం అయిన క్విజ్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా చేసింది.2005లో హీరోయిన్ గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.పలు హిట్ సినిమాలు చేసింది.

క‌ల‌ర్స్ స్వాతి

Tollywood Anchors Turns To Heroines Details, Tollywood Anchors, Anchors To Heroi

ఈమె గురించి తెలుగు జనాలకు పెద్దగా పరిచయం అవసరం లేదు.ఓ చానెల్ లో వచ్చిన కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.అనంతరం ఆమె అష్టాచెమ్మ సినిమాతో హీరోయిన్ మారింది.

పలు సినిమాల్లో నటించినా.స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

అనసూయ

కామెడీ షో ద్వారా బుల్లితెరపై తెగ సందడి చేసిన ఈ అమ్మడు.నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.క్ష‌ణం, రంగ‌స్థ‌లం, పుష్ప సినిమాల్లో ఈమె చేసిన క్యారెక్టర్లు మంచి గుర్తింపు వచ్చేలా చేశాయి.

ర‌ష్మీ

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ ముద్దుగుమ్మ కూడా చాలా కాలంగా యాంగకర్ గా చేస్తుంది.ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి వారెవ్వా అనిపించింది.

శ్రీముఖి

Advertisement

అటు యాంకర్ శ్రీముఖి కూడా చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తుంది.తాజాగా చంద్రిక అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

సుమ

తెలుగు టెలివిజయ్ తెరపై ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు.దశాబ్దాలుగా యాంకర్ గా చేస్తున్న సుమ.తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది.

తాజా వార్తలు