బాబోయ్.. క్రాకర్స్ కోసం బండ్ల గణేష్ అంత ఖర్చు పెట్టాడా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలను గుప్పిస్తూ వార్తలో నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎవరైనా విమర్శిస్తే వారిపై ఘాటు వాఖ్యలు చేస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలిచే బండ్ల గణేష్ తాజాగా ఒక విషయంలో వార్తల్లో నిలిచాడు.

అదేమిటంటే గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా బండ్ల గణేష్ టపాసుల కోసం భారీగా ఖర్చు పెట్టాడట.ఆ టపాసులకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ట్రోలింగ్స్ చేస్తూ సెటైర్స్ కూడా వేశారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది కూడా బండ్ల గణేష్ దీపావళి పండుగ సందర్భంగా టపాసుల కోసం భారీ మొత్తంలో డబ్బులు పెట్టి టపాసులు కొన్నట్టు తెలుస్తోంది.ఒక మీడియా ప్రతినిధి ఈసారి ఖర్చు చేసి టపాసులు కొన్నారు అని ప్రశ్నించగా.

మొత్తం 4 లక్షల 20 వేల రూపాయలకు క్రాకర్స్ కొన్నానంటూ బండ్లన్న చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.అంతేకాకుండా ప్రతి ఏడాది దీపావళి పండుగ కానుకగా తన మిత్రులకు గిఫ్ట్ లుగా క్రాకర్స్ పంపిస్తుంటానని బండ్ల గణేష్ తెలిపారు.ఈ ఏడాది తాను కొన్న టపాసుల ఫొటోను బండ్ల గణేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.

తన సొంతూరు షాద్ నగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి టపాసులతో బండ్ల దిగిన ఫొటో వైరల్ గా మారింది.ఆ ఫోటోలపై స్పందించిన పలువురు నెటిజెన్స్ సెటైర్స్ వేస్తూ బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు