ఓ అమ్మాయితో డేటింగ్ లో ఉన్న అడివి శేష్.. త్వరలోనే పెళ్లి

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ కూడా ఒకరు.అడివి శేష్ హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే అడివి శేష్ నటించిన గూఢచారి, క్షణం లాంటి సినిమాలు విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో కూడా అయ్యారు.ఇలా ఉంటే ప్రస్తుతం అడివి శేష్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్వరలోనే అడివి శేష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Advertisement
Tollywood Actor Adivi Sesh To Get-married Soon Adivi Sesh, Tollywood, Marriage,

ఈ సందర్భంగా అడివి శేషు మాట్లాడుతూ.తన పెళ్లి విషయంలో తన కంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా తొందర పడుతున్నారని తెలిపారు.

ఏలా అయినా సరే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నాడు.అయితే ఇంతకు ముందు వరకు తన పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదట.

కానీ తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం పెళ్లి విషయంలో ఒత్తిడి తెస్తుండటంతో పెళ్లి గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారట.

Tollywood Actor Adivi Sesh To Get-married Soon Adivi Sesh, Tollywood, Marriage,

ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు అడివి శేష్.ప్రస్తుతం తాను ఒక యువతి తో డేటింగ్ లో ఉన్నానని.ఆ అమ్మాయిది హైదరాబాద్ అని.ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? అన్న విషయాలను సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ఆ విషయాన్ని సస్పెన్స్ గా పెట్టాడు అడివి శేష్.అడివి శేష్ అలా చెప్పడంతో అతడు చెప్పిన ఆ అమ్మాయి ఎవరా అని తల పట్టుకుని ఆలోచిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అడివి శేష్ చెప్పినదాన్ని బట్టి చూస్తే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తెలుస్తోంది.ఇకపోతే అడివి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇందులో ఆర్మీ మేజర్ రోల్ లో నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా 2022, ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు