నేడే సంకష్టహర చతుర్థి.. బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో ఇలా కడితే?

వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజులలో సంకష్టహర చతుర్థి ఒకటి.

నేడు (ఆదివారం) సంకష్టహర చతుర్థి కావటంతో వినాయకుడికి ప్రత్యేక పూజలను చేయడం వల్ల సకల సంపదలు కలిగిస్తాడని పండితులు చెబుతున్నారు.

మన జీవితంలో ఏర్పడిన ఒత్తిడి ఆందోళనలు తొలగిపోవాలంటే నేడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.మరి సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం.

సంకష్టహర చతుర్థి రోజు సూర్యోదయాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం వినాయకుడికి సంకష్ట చతుర్ధి వ్రతాన్ని ఆచరించాలి.

చంద్రుని దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.చంద్రుని దర్శనం తర్వాత వినాయకుడికి ప్రత్యేక పువ్వులతో అలంకరించి పూజ చేయాలి.

Advertisement

వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక, మోదకాలు తప్పనిసరిగా పూజలు సమర్పించాలి.అదేవిధంగా వినాయకుడి పూజలో భాగంగా ఆరు మీటర్ల ఎర్రని వస్త్రాన్ని తీసుకొని వినాయకుడు ముందు ఉంచి పసుపు కుంకుమతో అలంకరించాలి.

మన మనసులో ఏదైనా బలమైన కోరికను కోరుకొని మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని వస్త్రంలోకి వేయాలి.అదేవిధంగా రెండు తమలపాకులు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని ఆ బియ్యాన్ని మూటకట్టి సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి.ఆ విధంగా కట్టిన మూటను స్వామివారి ముందు నుంచి ధూప దీప నైవేద్యాలతో నమస్కరించాలి.

అనంతరం వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ 3 లేదా 11 ప్రదక్షిణాలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు