రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ సంచలన విజయం సాధించి దాదాపు 15 నెలలు అయినా ఏదో ఒక విధంగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు సైతం ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
హాలీవుడ్ దిగ్గజం క్రిస్ హెమ్స్ వర్త్ తాజాగా ఎన్టీఆర్, చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలోనే ఆర్.ఆర్.ఆర్ సినిమాను చూశానని ఈ సినిమా అద్భుతంగా అనిపించిందని క్రిశ్ హెమ్స్ వర్త్ తెలిపారు.ఈ సినిమా అస్సలు నమ్మలేని విధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. చరణ్ ఎన్టీఆర్ ( Ram charan 0నటన అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఇద్దరు హీరోలతో కలిసి నటించే ఛాన్స్ వస్తే అద్భుతమే అని క్రిస్ హెమ్స్ వర్త్ వెల్లడించడం గమనార్హం.

అయితే ఇదే సమయంలో మరో హాలీవుడ్ నటుడు టోబ్ నిగ్వే( Tobe Nwigwe ) కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి స్పందించారు.ఈ నటుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి పాజిటివ్ గా చెప్పుకొచ్చారు.ఆర్.ఆర్.ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ దే మెయిన్ రోల్ అని ఆయన కామెంట్లు చేశారు.ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ బీస్ట్స్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ నటుడు ఎన్టీఆర్ గురించి పాజిటివ్ కామెంట్లు చేయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ప్రస్తుతం దేవర ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ప్రేక్షకులకు తెగ సంతోషాన్ని కలిగిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం.టోబ్ నిగ్వే చేసిన కామెంట్లు అభిమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి.