అటా ? ఇటా ? ఎటు దూకుదాం ! జనసేన లో ఒకటే కన్ఫ్యూజన్ ?

ఏం ఎన్నికలో ఏంటో కానీ అందరిని ఒకటే టెన్షన్ , కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాయి.

ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే టెన్షన్ సామాన్య జనం నుంచి బడా నాయకుల వరకు ఎవరికీ అంతు చిక్కడంలేదు.

అసలు ఏపీలో టీడీపీ, వైసీపీ లలో స్పష్టంగా అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటో అంతు తేలడంలేదు.ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉండడంతో ఓటరు నాడి ఎలా ఉంది అనే విషయం ఒకటే కన్ఫ్యూజన్ కి గురిచేస్తోంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఇప్పటికే అనేక సర్వేల ద్వారా తేలినట్టు బయట ప్రచారం జరుగుతుండగానే టీడీపీ అధినేత చంద్రబాబు తామే అధికారంలోకి రాబోతున్నామని, ఇది పక్కా అని చెబుతూ అందరిని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది.

తమకు అరకొర సీట్లు వచ్చినా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందేనని అయితే ఆ పార్టీ ఏదో తెలియక జనసేన తర్జనభర్జన పడుతోంది.ఇప్పటికే అంతర్గతంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడని అపవాదు మూటగట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో చూసుకుని దానిని అనుసరించి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Advertisement

ఈ ఎన్నికల్లో గెలించిన జనసేన అభ్యర్థుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆ తరువాత తమ పొలిటికల్ స్టెప్ వేయాలని చూస్తున్నాడట.పవన్ ముందు నుంచి అంచనా వేస్తున్నట్టు ఏపీలో నిజంగా నిజంగా హంగ్ ఏర్పడితే జనసేన పార్టీకి కి పదుల సంఖ్యలో సీట్లు వస్తే అప్పుడు తమ డిమాండ్ల చిట్టా విప్పి , తమ కండిషన్స్, ఆబ్లిగేషన్స్ చెప్పాలని పవన్ ఆలోచనగా ఉందట.

ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చినా వైసీపీ వచ్చినా తమ కోర్కెల చిట్టాలో మార్పేమీ లేదన్నట్టుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.కాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాస్త ముందుగా తెలిస్తే ఆ పార్టీతో సఖ్యతగా ఉండవచ్చని జనసేన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు