అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి పట్టం.. మంత్రి కేటీఆర్

మునుగోడులో ప్రజలు అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మునుగోడు ఉపఎన్నికలో గులాబీ దండు తిరుగులేని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందన్నారు.నల్గొండ గడ్డపై ఉన్న 12 సీట్లకు టీఆర్ఎస్ కు జై కొట్టినందకు హర్షం వ్యక్తం చేశారు.

Title For Development And Self Respect.. Minister KTR-అభివృద్ధ�

ఈ నేపథ్యంలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్ట్ పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.మునుగోడు ప్రజలపై బలవంతంగా మోదీ, అమిత్ షాలు ఈ ఎన్నికల్ని రుద్దారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు తొక్కేశారని పేర్కొన్నారు.డబ్బు, అధికారమదంతో మునుగోడును కొనేయాలనుకున్నారని విమర్శించారు.

Advertisement

జనం గొంతు నొక్కాలని బీజేపీ ప్రయత్నించిందని మండిపడ్డారు.ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే కోట్లతో దొరికిందన్న ఆయన.బీజేపీ నేతల అనుచరులేనని వెల్లడించారు.కానీ తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను తెలంగాణ ప్రజలు ఎగురవేశారని వెల్లడించారు.

పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు