త్రివిక్రమ్ మహేష్ కాంబో సినిమా కి టైటిల్ ఫిక్స్...

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) అభిమానులకు…సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అంటే పండగే.ఈ రోజు గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు.

 Title Fixed For Trivikram Mahesh Combo Movie Trivikram , Title , Ssmb28 , Guntu-TeluguStop.com

ఎందుకంటే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజున తన సినిమాకు సంబంధించిన అప్‌టేట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది.ఈసారి కూడా త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాకు అదే చేయబోతున్నారు.

దీని కోసం త్రివిక్రమ్( Trivikram ) తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌ను కూడా పక్కన పెట్టాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌తో పాటు తనను తాను పూర్తిగా మార్చుకున్నాడని అంటున్నారు .

 Title Fixed For Trivikram Mahesh Combo Movie Trivikram , Title , SSMB28 , Guntu-TeluguStop.com
Telugu Guntur Karam, Khaleja, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Tollywo

తన వర్కింగ్ స్టైల్‌‌తో పాటు సెంటిమెంట్‌ను కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటల్‌ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ప్రకటించనున్నారని అనుకున్నా .ముందుగానే అప్ డేట్ వచ్చేసింది గుంటూరు కారం( Guntur Karam ) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.ఈ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ నెట్టంట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ నెల 31న‌ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమాకు సంబంధించిన ఈ టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుద‌ల చేయ్య‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Telugu Guntur Karam, Khaleja, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Tollywo

ఈ టీజర్ గురించి విడుదలకు ముందే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.ఇందులో మహేష్ బాబు ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా చూపించినట్టు టాక్ వినిపిస్తుంది.మహేష్ బాబు లోని మాస్ యాంగిల్స్ ని ఇది వరకు మనం చాలా చూసాము, కానీ ఈ చిత్రం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని మాస్ కోణాన్ని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించబోతున్నాడు .ఇక టీజర్ విషయానికి వస్తే, ఇది 47 సెకండ్ల నిడివి ఉంటుందని ., ఇందులో ఒక ఊర మాస్ డైలాగ్ తో పాటుగా, కొన్ని యాక్షన్ షాట్స్ , మహేష్ బాబు తొడ గొడితే జీప్ గాల్లోకి లేచే షాట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు .టీజర్ వర్క్ ప్రస్తుతం మహేష్ బాబు డబ్బింగ్ మినహా మిగతా మొత్తం పూర్తి అయ్యింది.పు మహేష్ బాబు ఈ టీజర్ కి డబ్బింగ్ కూడా నేడు పూర్తి చెయ్యబోతున్నట్టు సమాచారం.

మహేష్ కెరీర్ ని ఒక్కసారి చూస్తే ఖలేజా కి ముందు, ఖలేజా( Khaleja ) కి తర్వాత అని విభజించవచ్చు.ఖలేజా చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, మహేష్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉంది, వాడుకోండి అంటూ డైరెక్టర్స్ చూపించిన సినిమాగా నిల్చింది.

ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా ఆ రేంజ్ లో చెప్పుకునే విధంగా ఉంటుందని టాక్ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube