తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం జనవరి ఫిబ్రవరి కోటా టికెట్లు.. ఎప్పుడు విడుదల చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించాలని భక్తులు పరితపించిపోతూ ఉంటారు.

శ్రీవారి బ్రేక్ దర్శనాలు వీఐపీలు వారి సిఫారసులపై టిటిడి జారీచేస్తుంది.పరిమిత కోటాలో దర్శన భాగ్యం కొంతమంది భక్తులకు మాత్రమే కలుగుతుంది.

సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసులేని సామాన్యులకి కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిటిడి అందుబాటులోకి తెచ్చింది.300 ప్రవేశ దర్శనాలు ముందు ఆఫ్లైన్లో అందించిన భక్తుల రద్దీ దృష్ట్యా ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు.

Tirumala Srivari Special Darshan January February Quota Tickets When Will They

ప్రతి నెల చివరి వారంలో అర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, వర్చువల్ సేవల టికెట్లు, నిత్యసేవ లక్కీ డీప్ విడుదల టిటిడి చేస్తూ ఉంటుంది.ప్రతినెల 20 నుంచి 25 లోపు దర్శనం టికెట్లు విడుదల ప్రక్రియ రోజుకు ఒక దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తూ వస్తూ ఉండేది.జియో క్లౌడ్ వర్చువల్ క్యూ విధానం ద్వారా సైట్ డౌన్ అవ్వకుండా ప్రత్యేక చర్యలు టిటిడి తీసుకుంటూ ఉంటుంది.

Advertisement
Tirumala Srivari Special Darshan January February Quota Tickets When Will They

ఇక ప్రతి నెల మాదిరిగానే 10 రోజుల ముందే మరుసటి నెల సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను టీటీడీ విడుదల చేస్తూ ఉంటుంది.

Tirumala Srivari Special Darshan January February Quota Tickets When Will They

అయితే జనవరి 2వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని ఉద్దేశంతో గత సంవత్సరం డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేసింది.అయితే 12వ తేదీ నుంచి మిగిలిన రోజుల్లో ప్రత్యేక ప్రవేశ టోకెన్లను టీటీడీ పెండింగ్లో ఉంచింది.అయితే జనవరి 12వ తేదీ నుంచి ఈనెల 31 వ తేదీకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టోకెన్లను రోజువారి 20 వేల చొప్పున జనవరి 9వ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తుంది.

ఈనెల తొమ్మిదవ తేదీన ఉదయం 10 గంటలకు జనవరి ఫిబ్రవరి కోటాకు సంబంధించిన స్పెషల్ దర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు